Tumbak Nawazi Tabla : జీవితాన్ని వెలిగించే సాధనాల్లో కళలు ఎన్నో. జీవితం పండాలంటే కాస్తంత ప్రకృతిని ఆస్వాదించే కోరిక కూడా ఉండక తప్పదు. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని అప్పట్లో నానుడి.
కానీ ఇప్పుడు సంగీతం లైఫ్ నే కాదు ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తోంది. టెక్నాలజీ పుణ్యమా అంటూ సోషల్ మీడియా టాప్ రేంజ్ లో దూసుకు వెళుతున్న ప్రస్తుత సమయంలో కళకు, కళాకారులకు, ప్రతిభావంతులకు, నైపుణ్యం కలిగిన వారికి ఎనలేని అవకాశాలు దక్కుతున్నాయి.
ఎవరి పంచన చేరాల్సిన అవసరం లేదు. ఇంకెవ్వరినీ దేబరించాల్సిన పని లేదు. ఉన్నదల్లా కాస్తంత ప్రతిభ ఉన్నా చాలు వెంటనే అప్ లోడ్ చేస్తున్నారు. ప్రపంచ టెక్ సెర్చింగ్ దిగ్గజం గూగుల్ వచ్చాక ప్రపంచం చిన్నదై పోయింది.
మనుషుల్ని వెలిగించి కలిపి ఉంచే సంగీతం, దాని వెనుక ఉండే ఉపకరణాలు, వాయిద్యాలు లెక్కలేనంతగా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. గుండెల్ని మీటుతున్నాయి.
అమెరికన్ దేశీ పేరుతో అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన వారిని ఇందులో పరిచయం చేస్తున్నారు. తాజాగా కెహర్వా తాల్ లేదా కెహర్బా తాల్(Tumbak Nawazi Tabla )స్వర వాయిద్యానికి మెరుగులు దిద్దుతోంది తుంబక్ నవాజీ అనే కళాకారిణి.
తబలలో ఇది ఓ సంచలనం. ఇంట్లో ప్రశాంతంగా ఉండే వారి కోసం ఆనందాన్ని పంచేలా చేస్తోంది ఈ వాయిద్యం. కీర్తనలు, మంత్ర పఠనం, తదితర వాటి కోసం దీనిని వాడుతండడం విశేషం.
ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేసేందుకు రెడీ అవుతోంది. కళాభిమానులు దయచేసి ఆమె పనితనాన్ని చూడండి. ఆస్వాదించండి. వీలైతే ఆదరించండి. అక్కున చేర్చుకోండి.
Also Read : ఓటీటీలో ‘శ్యామ్ సింగరాయ్’ సెన్సేషన్