Taliban Fighters Fire : మహిళల నిరసన..తాలిబన్ల కన్నెర్ర
గాల్లోకి కాల్పులు..జర్నలిస్టులపై దాడులు
Taliban Fighters Fire : కరడుట్టిన ఇస్లామిస్టులగా పేరొందిన తాలిబన్లు ఆప్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకుని ఏడాది పూర్తయింది. తమకు స్వేచ్ఛ కావాలని, చదువు కునేందుకు అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
తమను మనుషులుగా చూడలేని మీ పాలన తమకు వద్దంటూ మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీపై తాలిబన్లు(Taliban Fighters Fire) కన్నెర్ర చేశారు. పలువురిని గాయపరిచారు.
ఒకానొక సమయంలో గాల్లోకి కాల్పులు జరిపారు. అంతే కాకుండా భారీ ర్యాలీతో పాటు తాలిబన్లను నిరసిస్తూ వస్తున్న నిరసనకారులను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై కూడా చేయి చేసుకున్నారు తాలిబన్లు.
ఆఫ్గనిస్తాన్ దేశ రాజధాని కాబూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళలు ఎంతకూ తగ్గక పోవడంతో గాల్లోకి కాల్పులు జరిపి గుంపులను చెదరగొట్టారు.
పలువురు మహిళలు తాలిబన్ల చేతిలో గాయపడ్డారు. గత ఏడాది ఆగస్టు 15న అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు తాలిబన్లు. ఆఫ్గనిస్తాన్ లో అమెరికా జోక్యం చేసుకున్న రెండు దశాబ్దాల కాలంలో మహిళలు సాధించిన స్వల్ప లాభాలను తాలిబన్లు వెనక్కి తీసుకున్నారు.
ప్రతి ఒక్కరు పరదాలు ధరించాలని, ఉద్యోగాలు చేయ కూడదని, విద్యకు దూరం చేస్తూ వచ్చారు. దీనిని వ్యతిరేకిస్తూ 40 మంది మహిళలు రొట్టె..పని..స్వేచ్ఛ అని ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
కాబూల్ లోని విద్యా మంత్రిత్వ శాఖ భవనం ముందు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో సమీపంలోని దుకాణాలలో ఆశ్రయం పొందిన కొంత మంది మహిళలను వెంబడించారు. ఆగస్టు 15 బ్లాక్ డే అంటూ నినదించారు.
Also Read : చైనా అడ్డుకోవడం దురదృష్టకరం