Talibans Shock : మహిళా ఉద్యోగులకు తాలిబన్లు షాక్
మీ బదులు మగవాళ్లను పంపండి
Talibans Shock : తాలిబన్లు మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బాలికలు, యువతులు, మహిళలపై పలు ఆంక్షలు విధించారు. తాజాగా కోలుకోలేని షాక్ ఇచ్చారు.
వివిధ రంగాలలో పని చేస్తున్న ఆఫ్గనిస్తాన్ కు చెందిన మహిళా ఉద్యోగులు తాము జాబ్స్ మానేసి మీ ఇంట్లో లేదా మీ కుటుంబాలలో ఉన్న పురుషులను పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక గార్డియన్ ప్రత్యేక కథనం ప్రచురించింది. మహిళా ఎంప్లాయిస్ మీకు ప్రత్యామ్నాయంగా పురుషులను పంపించాలని, వారి అర్హతలకు అనుగుణంగా అని స్పష్టం చేసింది.
ప్రస్తుతం తాలిబన్లు(Talibans Shock) జారీ చేసిన ఈ ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఐక్య రాజ్య సమితి తీవ్రంగా ఆక్షేపణలు చెప్పింది ఆఫ్గన్ పై. పిల్లలు చదువు కోవాలని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దంటూ కోరింది.
కానీ ఆఫ్గనిస్తాన్ మాత్రం పట్టించు కోలేదు. తాలిబన్లు అక్రమంగా స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఫత్వాలు, ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. పలు చోట్ల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ప్రధానంగా మీడియా సంస్థలలో పని చేసే మహిళలు తప్పనిసరిగా బురఖా ధరించాలని, ముఖం కనిపించ కూడదని ఆదేశించారు.
అంతే కాకుండా వారికి ఇస్తున్న జీతాలలో కూడా కోతలు విధించారంటూ వాపోయారు కొందరు మహిళా ఉద్యోగులు. వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అక్కడి వాతావరణం అద్దం పడుతోందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఆప్ నేత అమానతుల్లా ఖాన్ కు షాక్