K Annamalai : అన్నామ‌లైపై ప‌రువు న‌ష్టం కేసు

డీఎంకే ఫైల్స్ పై త‌మిళ‌నాడు స‌ర్కార్

K Annamalai : భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మిళ‌నాడు చీఫ్ అన్నామ‌లైకి షాక్ త‌గిలింది. ఆయ‌న డీఎంకే ఫైల్స్ పేరుతో నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశారంటూ డీఎంకే స‌ర్కార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు బీజేపీ చీఫ్ పై హైకోర్టులో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేసింది. చెన్నై మెట్రో కాంట్రాక్టును ప‌రిష్క‌రించేందుకు 2011లో ప్ర‌స్తుత సీఎం ఎంకే స్టాలిన్ కు రూ. 200 కోట్లు చెల్లించారంటూ కె.అన్నామ‌లై ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. దీనికి ఆయ‌న ముద్దుగా డీఎంకే ఫైల్స్ అంటూ పేరు పెట్టాడు. దీనిని తీవ్రంగా ఖండించారు సీఎం ఎంకే స్టాలిన్. చ‌వ‌క‌బారు రాజ‌కీయాల‌కు దిగ‌జార‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. ద‌మ్ముంటే నిరూపించాలంటూ స‌వాల్ విసిరారు.

ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రువు న‌ష్టం కింద కేసు న‌మోదు చేసింది. అన్నామలై ఆరోప‌ణ‌ల‌ను డీఎంకే గ‌తంలో జోక్ గా అభివ‌ర్ణించింది. సీఎం స్టాలిన్ అన్నామ‌లై ప‌రువు తీస్తున్నారంటూ సిటీ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా స్టాలిన్, డీఎంకే నాయ‌కులు రూ. 1.34 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెడుతున్న దుబాయ్ కంపెనీకి డైరెక్ట‌ర్లుగా ఉన్నారంటూ పేర్కొన్నారు అన్నామ‌లై. డీఎంకే అధికార ప్ర‌తినిధి టీకేఎస్ గోపాల‌న్ నిప్పులు చెరిగారు.

Also Read : నిర్మ‌ల‌పై నిప్పులు చెరిగిన డీకే

Leave A Reply

Your Email Id will not be published!