Tamil Nadu Agrees : రాజీవ్ హంతకుల విడుదలకు సర్కార్ ఓకే
ముందస్తుకు తమిళనాడు అంగీకారం
Tamil Nadu Agrees : దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల ముందస్తు విడుదలకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. తన అఫిడవిట్ లో వారి జీవిత ఖైదు ఉపశమనానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. నశిని, రవిచంద్రన్ లను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులు నళినీ శ్రీహరన్ , ఆర్బీ రవిచంద్రన్ లను ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు సర్కార్(Tamil Nadu Agrees) సుప్రీంకోర్టులో సిఫారసు చేసింది. అంతకు ముందు తోటి దోషి ఏజీ పెరారివాలన్ ను విడుదల చేయాలని కోరుతూ నళిని, రవిచంద్రన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సెప్టెంబర్ 9, 2018న జరిగిన కేబినెట్ సమావేశంలో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల క్షమాభిక్ష పిటిషన్ లను పరిశీలించామని , ఆర్టికల్ 161 కింద ఇచ్చిన అధికారాన్ని ప్రయోగిస్తూ వారి జీవిత ఖైదులను తగ్గించాలని గవర్నర్ కు సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉండగా ఏడుగురి జీవిత ఖైదీ పిటిషనర్లకు సంబంధించి పేర్కొన్న సిఫార్సు సెప్టెంబర్ 11న అప్పటి తమిళనాడు గవర్నర్ కు వ్యక్తిగతంగా ఆమోదం కోసం పంపించామని, ఆనాటి నుంచి నేటి వరకు పెండింగ్ లో ఉందని పేర్కొంది ప్రభుత్వం. ఆర్టికల్ 161న ప్రకారం గవర్నర్ కు ఉన్న అధికారం, నేరాలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారి – ఐఎఫ్సీ 302 అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక డొమైన్ లోకి వస్తుంది.
ఇదే ఆర్టికల్ 161 ప్రకారం నళిని, రవిచంద్రన్ లు దాఖలు చేసిన పిటిషన్ పై తుది నిర్ణయం తీసుకునే అధికారం తమదేనని స్పష్టం చేసింద తమిళనాడు ప్రభుత్వం. 2018లో ఆనాటి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయమే అంతిమమని , దానిని అమలు చేయవచ్చని పేర్కొంది.
జనవరి 27, 2021న గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. గత ఏడాద తొమ్మిది నెలలుగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఏజీ పెరారివాలన్ విడుదలైన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పేర్కొంటూ నళిని, రవిచంద్రన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదే ఉపశమనం కోరుతూ మద్రాస్ హైకోర్టు తలుపు తట్టారు. పిటిషన్ ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. 30 ఏళ్లుగా జైలులో ఉన్న రవిచంద్రన్ అధికారికాంగా విడుదల చేయాలన్న తన కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.
Also Read : అదానీ 34 ఎకరాలపై కీలక కామెంట్స్