Tamil Seers : ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన మ‌ఠాధిప‌తులు

నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంలో

Tamil Seers : త‌మిళ‌నాడుకు చెందిన పేరు మోసిన మ‌ఠాధిప‌తులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. రూ. 1200 కోట్ల‌తో నిర్మించిన నూత‌న పార్లమెంట్ భ‌వ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌త్యేకంగా రాజ‌దండం తీసుకు వ‌చ్చారు పార్ల‌మెంట్ కు. దీనికి త‌మిళ‌నాడు(Tamil) నుండి వ‌చ్చిన 19 మంది మ‌ఠాధిప‌తులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. మోదీతో పార్ల‌మెంట్ భ‌వ‌నంలోకి తీసుకు వ‌చ్చిన స‌మ‌యంలో ఆశీర్వ‌దించారు.

ఈ సంద‌ర్భంగా మ‌రోసారి పీఎం కావాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా మ‌ఠాధిప‌తులు చ‌ర్చ‌నీయాంశంగా మారు. త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చిన మ‌ఠాధిప‌తులు పేరు పొందిన వారు. మొత్తం 19 మంది వ‌చ్చారు. వీరికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. అంతే కాదు స్పెష‌ల్ ఫ్లైట్ ను స‌మ‌కూర్చింది. దీని ద్వారా తమిళుల‌కు(Tamil) మ‌రింత చేరువైంది కేంద్ర స‌ర్కార్. ఇప్ప‌టికే అక్క‌డ భార‌తీయ జ‌న‌తా పార్టీ పాగా వేయాల‌ని చూస్తోంది. ద‌క్షిణాదిన అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే ప్ర‌భావం ఉంటుందే త‌ప్ప వేరే పార్టీల‌కు ప్ర‌స్తుతం చోటు లేకుండా పోయింది.

ఈ త‌రుణంలో అనూహ్యంగా యంగ్ మాజీ ఐపీఎస్ అన్నామ‌లై బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టాక సీన్ మారింది. అక్క‌డ రోజు రోజుకు పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఇక మ‌ఠాధిప‌తుల‌కు రాబోయే రోజుల్లో పూర్తి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి. ఈ సంద‌ర్భంగా వారికి భ‌రోసా క‌ల్పించారు. త‌మ‌కు మ‌ద్ద‌తు లేక పోవ‌డం వ‌ల్ల చాలా పురాత‌న ఆధీనాలు క‌రువ‌య్యాయి. పీఎం మ‌మ్మల్ని పిలిచి గౌర‌వించ‌డం పీఠాధిప‌తుల‌ను ఉత్సాహ ప‌రిచేలా చేసింద‌న్నారు ధ‌ర్మ‌పురం మ‌ఠానికి చెందిన సీనియ‌ర్ న్యాయ‌వాది ఎం. కార్తికేయ‌.

Also Read : Delhi Police Case

Leave A Reply

Your Email Id will not be published!