Tamilisai Soundar Rajan : రాజ్ భవన్ కాదది ప్రజా భవన్ అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్(Tamilisai Soundar Rajan). తన పరిమితులు ఏమిటో తెలుసన్నారు. గవర్నర్స్ కోటా కింద ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తనకు పవర్స్ ఉంటాయని గుర్తించాలన్నారు.
కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ఎంపిక చేయలేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళి సై సౌందర్య రాజన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ను, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. దీనిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు.
రాజ్ భవన్ లో ప్రజల నుంచి విన్నపాలు తీసుకోవడం అన్నది నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి ప్రధానికి, అమిత్ షా కు తెలుసన్నారు.
నాగర్ కర్నూల్, భద్రాచలం సందర్శించానని, సమ్మక్క సారక్కలను మొక్కుకున్నానని చెప్పారు గవర్నర్. రాష్ట్రం గురించి తాను నివేదిక చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
ఏం జరుగుతుందనే విషయం కేంద్రానికి తెలుసన్నారు తమిళిసై సౌందర్య రాజన్(Tamilisai Soundar Rajan). ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. తనకు ఉన్న పవర్స్ ను ఇప్పటి దాకా ప్రయోగించ లేదన్నారు.
తాను ఏం చేస్తున్నానని జనం పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పారు. ప్రభుత్వంపై ఆమె సెటైర్లు విసిరారు. ప్రోటోకాల్ ను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు గవర్నర్.
ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశానని, కానీ ఒక్కరి విషయంలో అభ్యంతరం చెప్పానని స్పష్టం చేశారు.
Also Read : ఎవరో తేల్చండి మా వాళ్లుంటే శిక్షించండి