Tamilisai Soundararajan : ఖాళీల భర్తీ ఆలస్యం గవర్నర్ గరం
యూనివర్శిటీల్లో ఎందుకింత ఆలస్యం
Tamilisai Soundararajan : రాష్ట్రంలో మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా మారి పోయింది. చెన్నైలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీలో ఉన్నారు. ఇదే సమయంలో విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయక పోవడంపై గవర్నర్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాయడం కలకలం రేపింది.
ప్రస్తుతం తమిళి సై, కేసీఆర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయడంలో గవర్నర్ కావాలని తాత్సారం చేస్తోందంటూ తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. తన పరిధులు ఏమిటో తెలుసుని ఇందులో విమర్శించేందుకు ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు గవర్నర్.
ఈ తరుణంలో యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయా యూనివర్శిటీలలో ఖాళీలు ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదో, దానికి గల కారణాలు ఏమిటో, మౌలిక వసతులను ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ ప్రశ్నించారు తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundararajan).
గత మూడు సంవత్సరాలలో ఒక్క పోస్టు భర్తీ చేయక పోవడం వెనుక గల కారణం ఏమిటని ఆరా తీశారు. ఇదే సమయంలో టీఎస్ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై రాజ్ భవన్ కు వచ్చి చర్చించాలని విద్యా శాఖ మంత్రిని ఆదేశించారు.
మరో వైపు గవర్నర్ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కు కూడా లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : మోదీ నిర్వాకం వల్లే దేశం నాశనం – కేటీఆర్