Taneti Vanita : ఆరోగ్య సురక్ష శ్రీరామ రక్ష
హోం మంత్రి తావేటి వనిత
Taneti Vanita : కొవ్వూరు – సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ సర్కార్ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య వసతి సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తావేటి వనిత. ఆరోగ్యమే మహా భాగ్యం అన్న నానుడిని నిజం చేసిన ఘనత తమ సీఎంకు దక్కిందన్నారు.
కొవ్వూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హోం మంత్రి ప్రారంభించారు. క్యాంపులో అందిస్తున్న వైద్య సేవల తీరును మంత్రి పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
Taneti Vanita Comment
ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత(Taneti Vanita) మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అందరికీ ఆరోగ్యం అందించాలి.. వారి ఆయుషును పెంచాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ వైద్యులు ఎవరూ ఇంటి వద్దకు వచ్చి పేద ప్రజల ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని సేవలు అందించిన దాఖలాలు లేవన్నారు. దేశంలోనే మొదటిసారిగా స్పెషలిస్టులను ఇంటి వద్దకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు తావేటి వనిత.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి వెళ్లినా జగనన్న ఆరొగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని తెలిపారు.
Also Read : Election Commission : భారీగా ఉన్నతాధికారుల బదిలీలు