Tanikella Bharani Viswanath : కళాతపస్వి చిరంజీవి – భరణి
కె. విశ్వనాథ్ కు మరణం లేదు
Tanikella Bharani Viswanath : తెలుగు సినిమా రంగానికే కాదు ప్రపంచ సినీ రంగానికి కూడా తీరని లోటు కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణం. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ అద్భుతం..కళాఖండం. ఇప్పటికీ ఆలోచింప చేసేలా ఉంటాయి. కె. విశ్వనాథ్ గురించి ఏం చెప్పాలి. ఎలా చెప్పాలి. నాకు మాటలు రావడం లేదు. ఆయన తీసిన చిత్రాలలో నేను నటించ లేక పోయాను.
కానీ ఇద్దరం కలిసి కొన్ని సినిమాలలో నటించే అదృష్టం తనకు దక్కిందన్నారు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి(Tanikella Bharani Viswanath). కళాతపస్వి పార్థివ దేహాన్ని దర్శంచి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మరణం తీరని లోటు. నాకు ప్రత్యేకించి తీరని నష్టం అని పేర్కొన్నారు. పైకి సీరియస్ గా ఉన్నట్టు కనిపించినా చాలా హాస్య ప్రియుడు అని తెలిపారు.
ఇదిలా ఉండగా కళాపతస్విని ఎన్నో అవార్డులు , పురస్కారాలు వరించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయననను ఘనంగా సత్కరించింది. 1992లో పద్మశ్రీ అవార్డు దక్కింది.
కె. విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన వయస్సు 92 ఏళ్లు. తన జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం సహాయ దర్శకుడిగా పని చేశారు. 1961లో ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన కుల వ్యవస్థ, వైకల్యం, అంటరానితనం, లింగ వివక్ష, వరకట్నం, సామాజిక ఆర్థిక సవాళ్లు వంటి ఇతివృత్తాలతో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Also Read : సినీ లోకానికి తీరని లోటు