TATA : భారతీయ పారిశ్రామిక రంగంలో తనకంటూ ఓ స్పెషలాటి కలిగి ఉన్న టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన రతన్ టాటా.
ఊహించని రీతిలో ప్రపంచంలోనే అత్యంత అత్యధిక ఆదాయంతో పాటు జనాదరణ కలిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ -2022 కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించి ఇప్పటి దాకా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఐపీఎల్ స్పాన్సర్ గా ఉండింది. ఇందు కోసం బీసీసీఐకి భారీగా చెల్లించింది.
తాజాగా అందిన సమాచారం మేరకు ఈ ఏడాది నిర్వహించే ఐపీఎల్ -2022 మెయిన్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ ఉండనుందని ఐపీఎల్ చైర్మన్ , మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఈ మేరకు వివో ఐపీఎల్ స్పాన్సర్ నుంచి వైదొలిగి టాటా గ్రూప్(TATA )నకు తన హక్కులను బదలాయించినట్లు చెప్పారు.
దీంతో ఇక నుంచి లీగ్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ కొనసాగనుందన్నమాట. ఇదిలా ఉండగా ఇవాళ ముంబైలో జరిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కు సంబంధించిన పాలక మండలిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.
2018-2022 నుంచి టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కుల కోసం రూ. 2200 కోట్ల డీల్ కలిగి ఉంది. ఇదిలా ఉండగా రతన్ టాటాకు దేశ భక్తి ఎక్కువ.
ఎక్కువగా ప్రచారం ఇష్టపడని ఈ అరుదైన వ్యాపారవేత్త లక్ష్యం ఒక్కటే మన టీంకు మనమే స్పాన్సర్ గా ఉండాలని. అందుకే ఆయన ఐపీఎల్ కు వేల కోట్లు వెచ్చించారు.
Also Read : వారెవ్వా అయ్యారే అయ్యర్