R Krishna Kumar Dies : టాటా వెటరన్ కృష్ణకుమార్ కన్నుమూత
ఇండియన్ హోటల్స్ కు మాజీ చీఫ్
R Krishna Kumar Dies : ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్ లో కీలకమైన బాధ్యతలు చేపట్టిన ఆర్. కృష్ణకుమార్ కన్నుమూశారు. ఆయనకు వయసు 84 ఏళ్లు. ఆతిథ్య విభాగం ఇండియన్ హొటల్స్ కు చీఫ్ గా పని చేశారు. అంతే కాకుండా కీలక పదవులను చేపట్టి విశిష్ట సేవలు అందించారు. భారత దేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.
టాటా సంస్థల చైర్మన్ రతన్ టాటా కు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. గ్రూప్ లో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తిగా పేరొందారు. ఆయన కేరళలో పుట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తన నివాసంలో ఆదివారం గుండె పోటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం తరలించినా ఫలితం లేక పోయింది.
ఈ సందర్భంగా రతన్ టాటా కీలక ప్రకటన చేశారు. తనకు అత్యంత ఆప్తుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఇక టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ టాటా సంస్థల అభ్యున్నతి కోసం ఆర్. కృష్ణకుమార్ కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయని పేర్కొన్నారు.
ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు చంద్రశేఖరన్. ఆర్. కృష్ణకుమార్ ను కోల్పోవడం(R Krishna Kumar Dies) పెద్ద లోటు అని వాపోయారు. ఆయన ఎల్లప్పుడూ తక్కువ ప్రాధాన్యత కలిగిన వారికి సహాయం చేయాలని , వారి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయాలని కోరుకున్నారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నామని తెలిపారు.
ఆర్. కృష్ణ కుమార్ మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు కేరళ సీఎం పినరయి విజయన్.
Also Read : అద్దె కట్టని మస్క్ పై ఓనర్ దావా