Tata Nue App : భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంతో ఆయన పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేశారు.
ఈ తరుణంలో అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తోంది టాటా గ్రూప్. ప్రస్తుతం ఐటీ, ఆటో మొబైల్ , ఏవియేషన్ ప్రతి రంగంలో సత్తా చాటుతోంది. షేర్స్ పరంగా దుమ్ము రేపుతోంది.
తాజాగా మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. దిగ్గజ సంస్థలు అమెజాన్, రిలయన్స్, గూగుల్ పే కు ధీటుగా టాటా న్యూ(Tata Nue App )పేరుతో యాప్ ను రిలీజ చేసింది టాటా గ్రూప్.
ఏకంగా ఇండియన్ క్రికెట్ ను శాసిస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. భారీ ఎత్తున ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్ టాటా కప్ నడుస్తోంది. ట్రావెల్ టూరిజం లోకి కూడా ఎంటరైంది.
ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్డింగ్ వేసింది. రూ. 18 వేలకు ఎయిర్ ఇండియాను స్వంతం చేసుకుంది. గతంలో ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ లోనే ఉండేది.
ఇదే సమయంలో గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎయిర్ ఇండియాను నిర్వహిస్తామని పేర్కొంది. కాగా టాటా న్యూ యాప్(Tata Nue App )గురించి కీలక కామెంట్స్ చేశారు టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.
ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో విమానాలు నడుపుతామని ప్రకటించారు. వీటి సేవలను డిజిటల్ మార్గాల ద్వారా అందజేస్తామన్నారు.
అందుకే టాటా న్యూను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ తో పాటు సోషల్ మీడియా, వెబ్ సైట్ లను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Also Read : పిట్ట కూత’పై ఎలన్ మస్క్ ఫోకస్