IND vs WI 3rd ODI : మూడో వన్డేలోనూ టీమిండియా హవా
3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్
IND vs WI 3rd ODI : వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డే లోనూ భారత్ విజయాన్ని నమోదు చేసింది. 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ ను కుదించారు. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
257 పరుగుల టార్గెట్ విండీస్(IND vs WI 3rd ODI) ముందుంచింది. బరిలోకి దిగిన విండీస్ కేవలం 137 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో టీమిండియా 119 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
ప్రత్యర్థి జట్టులో బ్రాండన్ కింగ్ 42 రన్స్ చస్తే కెప్టెన్ నికోలస్ పూరన్ 42 , హోప్ 22 పరుగులతో రాణించారు. మిగిలిన వారెవ్వరూ ఆశించిన మేర రాణించ లేక పోయారు.
ఇక భారత జట్టులో మరోసారి సత్తా చాటాడు యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీశాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్
పటేల్, ప్రసిద్ద్ క్రిష్ణ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు(IND vs WI 3rd ODI) విండీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంది. భారీ స్కోర్ నమోదు చేసింది.
ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్ , శుభ్ మన్ గిల్ ఫస్ట్ వికెట్ కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.
ఇద్దరూ కలిసి 113 రన్స్ చేశారు. ధవన్ 58 పరుగుల వద్ద అవుట్ కాగా శుభ్ మన్ గిల్ చివరి దాకా నిలబడ్డాడు. 98 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 44 రన్స్ చేస్తే సూర్య కుమార్ యాదవ్ 8 పరుగులతో నిరాశ పరిచాడు.
డక్ వర్త్ ప్రకారం 36 ఓవర్లకే కుదించడంతో 225 పరుగులు చేసింది. మొత్తం మీద శిఖర్ ధావన్ కు ఈ సీరీస్ గొప్ప అనుభూతిని మిగిల్చిందనే చెప్పక తప్పదు.
Also Read : అతడో దిగ్గజం ఎలా ఆడాలో చెప్పలేం