Team India : అడుగు దూరంలో భారత్
విశ్వ విజేత కోసం నిరీక్షణ
Team India : కోట్లాది ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. కేవలం అడుగు దూరంలో విశ్వ విజేత అయ్యేందుకు నిలిచి ఉంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్(Bharat Cricket) జట్టు. ఇప్పటి వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో విజయ యాత్ర కొనసాగించింది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ లలో గెలుపొందుతూ వచ్చింది.
Team India in Final
సెమీ ఫైనల్ లో దుమ్ము రేపింది. భారీ స్కోర్ సాధించింది. పరుగుల వరద పారింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. తమకు ఎదురే లేదని భారత క్రికెటర్లు చాటారు. క్రికెట్ లో ఉన్న మజా ఏమిటో చూపించారు. ముంబై వాంఖడే స్టేడియం ప్రేక్షకులతో నిండి పోయింది.
పలువురు క్రికెటర్లు ఈ మ్యాచ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 379 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తో పాటు శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ దుమ్ము రేపారు.
అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీమ్ చివరి దాకా పోరాడేందుకు ప్రయత్నం చేసింది. తొలుత కీలక బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. అనంతరం మైదానంలోకి దిగిన మిచెల్ , కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మిచెల్ సెన్సేషన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 134 రన్స్ తో ఆకట్టుకున్నాడు.
Also Read : Mohammed Shami : షమీ దెబ్బ కీవీస్ అబ్బా