IND vs SA 3rd Test : దక్షిణాఫ్రికాతో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది భారత క్రికెట్ జట్టు. కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇందు కోసం టీమిండియా భారీగానే కసరత్తు చేస్తోంది.
మూడు టెస్టులు, మూడు వన్డేల సీరీస్ లో భాగంగా భారత్ సౌతాఫ్రికాలో(IND vs SA 3rd Test )పర్యటిస్తోంది. ఇప్పటికే భారత్ , సఫారీ జట్లు చెరో మ్యాచ్ గెలుపొందాయి.
టీమిండియా సెంచూరియన్ వేదికగా 113 పరుగుల తేడాతో విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా జట్టు జోహెన్నస్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దీంతో ఇరు జట్లలో ఎవరిని టెస్టు సీరీస్ వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా భారత జట్టును గాయాలు వీడడం లేదు.
టీ20, వన్డే జట్టు సీరీస్ కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడడంతో ఏకంగా సఫారీ టూర్ కు దూరమయ్యాడు.
అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ. ఇదే సమయంలో రెండో టెస్టులో భాగంగా ఆడుతుండగా హైదరాబాదీ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ గాయంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు.
ఇంకో వైపు విరాట్ కోహ్లీ మొదటి టెస్టు ఆడినా వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో తిరిగి రానున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. ఇదే విషయాన్ని భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ద్రువీకరించాడు.
సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ ను తీసుకుంటాడా లేక 105 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మకు చాన్స్ ఇస్తాడా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : ద్రవిడ్ కు సల్మాన్ భట్ సపోర్ట్