BCCI Announces : టీమిండియా షెడ్యూల్ ఖరారు – బీసీసీఐ
అధికారికంగా వెల్లడించిన క్రీడా సంస్థ
BCCI Announces : భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రపచంలో ఏ దేశం చేయనన్ని ప్రయోగాలు చేస్తోంది.
ఈ ఏడాదిలో కీలకమైన మ్యాచ్ లు, టోర్నీలు ఆడబోతోంది టీమిండియా. యూఏఈలో ఈనెలలో ఆసియా కప్ జరగనుంది. ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది.
ఇక దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం తమ జట్టును ఆసియా కప్ కోసం ప్రకటించింది. తాజాగా బీసీసీఐ క్రికెట్ షెడ్యూల్ ను ఖరారు చేసింది. సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాలతో మూడు మ్యాచ్ ల టి20 సీరీస్ ప్రారంభం అవుతుంది.
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టి20 , వన్డే సీరీస్ ఆడనుంది 2022-23 సంవత్సరానికి. స్వదేశంలో ఆసిస్, సఫారీ జట్ల మ్యాచ్ లకు సంబంధించి తేదీలు కూడా ఖరారు చేసింది(BCCI Announces).
రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియాలోని ఐసీసీ వరల్డ్ కప్ కు సిద్దం అవుతోంది. అయితే టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లే ముందు టీమిండియా టి20ల్లో ఇరు జట్లతో తలపడుతుంది.
ఆసిస్ సీరీస్ లో 3 టి20 లు ఉండగా సఫారీతో జరిగే సీరీస్ లో 3 టీ20లు , వన్డేలు ఆడనుంది. మొహాలిలో ఆసిస్ తో మొదటి టి20 మ్యాచ్ జరుగుతుంది.
రెండో మ్యాచ్ నాగపూర్ లో మూడో మ్యాచ్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఇక దక్షిణాఫ్రికాతో హోమ్ సీరీస్ తిరువనంతపురంలో ప్రారంభం అవుతుంది.
రెండు, మూడు మ్యాచ్ లు గౌహతి, ఇండోర్ లో జరుగుతుంది. అక్టోబర్ 6న వన్డే సీరీస్ స్టార్ట్ అవుతుందని బీసీసీఐ వెల్లడించింది.
Also Read : ఆసియా కప్ కోసం పాక్ జట్టు డిక్లేర్