Team India Squad : జింబాబ్వే టూర్ కు ఇండియా టీం డిక్లేర్
స్కిప్పర్ ధావన్..చాహర్..త్రివాఠి..సూర్య
Team India Squad : జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తాడు. మరోసారి అతడికి బీసీసీఐ చాన్స్ ఇచ్చింది. ఫిట్ నెస్ నిరూపించు కోవడంతో దీపక్ చాహర్ కి చాన్స్ ఇచ్చారు.
ఈ జట్టుకు ఇది కీలకమైన సీరీస్. టి20 సీరీస్ లో కూడా ఉండాలని ధావన్ అనుకుంటున్నాడు. జింబాబ్వేతో ఆగస్టు 18 నుంచి హరారేలో జరగనున్న వన్డే సీరీస్ కు భారత జట్టును(Team India Squad) బీసీసీఐ ప్రకటించింది .
తాజాగా 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. సుదీర్గ గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు చాహర్.
ఇదిలా ఉండగా విండీస్ టూర్ లో భాగంగా జరిగిన మూడు వన్డేల సీరీస్ 3-0 తేడాతో శిఖర్ ధావన్ టీం క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్లను పక్కన పెట్టింది.
ఇక చాహర్ తో పాటు రాహుల్ త్రిపాఠిని కూడా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక తన ఫిట్ నెస్ ను నిరూపించు కునేందుకు ఇది మంచి చాన్స్ చాహర్ కు. ఇదిలా ఉండగా మూడు వన్డేలకు ఎంపిక చేసిన భారత జట్టు ఇలా ఉంది.
శిఖర్ ధావన్ కెప్టెన్ కాగా రుతురాజ్ , శుభ్ మన్ గిల్ , దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ , వాషింగ్టన్ సుందర్ , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్ పటేల్ , అవేష్ ఖాన్ , ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ , దీపక్ చాహర్ ఉన్నారు.
Also Read : వెయిట్ లిఫ్టింగ్ లో చానుకు బంగారు పతకం