Surya Kumar Yadav : రికార్డుల కంటే జ‌ట్టు గెలుపు ముఖ్యం

ముంబై క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్

ప‌రుగులు చేయ‌డం కంటే త‌న జ‌ట్టు గెలుపు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ముంబై స్టార్ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్. ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన కీల‌క పోరులో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 218 చేసింది. గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్.

కేవ‌లం 49 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సూర్యా భాయ్ 11 ఫోర్లు 6 సిక్స‌ర్లు కొట్టాడు. ఈ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో 80 ప‌రుగులు వ‌చ్చాయి. చివ‌రి బంతికి సిక్స్ కొట్టి ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. 103 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

మ్యాచ్ అనంత‌రం సూర్య కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడాడు. త‌న‌కు వ్య‌క్తిగ‌త రికార్డుల కంటే జ‌ట్టు గెలుపొంద‌డం త‌న‌కు ముఖ్య‌మ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 8 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగులు చేసింది. ఒకానొక ద‌శ‌లో 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 8 వికెట్లు కోల్పోయింది. ఆ స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన ఆఫ్గ‌నిస్తాన్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ రెచ్చి పోయాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 32 బంతులు ఎదుర్కొని 79 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అత‌డికి తోడు డేవిడ్ మిల్ల‌ర్ 41 ర‌న్స్ చేసి రాణించాడు.

Leave A Reply

Your Email Id will not be published!