Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ లో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం

ఇక మద్యం పాలసీపై హరీష్‌రావు, భట్టి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకుంది...

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బడ్జెట్‌పై చర్చలో భాగంగా హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క వస్తే గన్‌పార్క్‌ వద్ద ప్రజలనే అడిగి ఎవరి పాలన బాగుందో తెలుసుకుందామా అంటూ సవాల్‌ విసిరారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు. ఈ ప్రభుత్వానికి సమర్థత లేదనీ, అందుకే సంపద రావడం లేదని బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్‌రావు విమర్శించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌ అవాస్తవాలతో కూడి ఉందన్న హరీష్, ట్యాక్స్‌ రెవెన్యూ ఎక్కువ చూపారన్నారు. నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూలో రూ.35 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో చూపారు.

Telangana Assembly Meeting Updates

గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే విమర్శించిన వారే, ఇప్పుడు రూ.10 వేల కోట్ల విలువ చేసే భూములు అమ్మి నిధులు సమీకరిస్తున్నారన్నారు. భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని హరీష్(Harish Rao) డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో సాధ్యం కాని ఆదాయం ఎక్కువ చూపారన్నారు. బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించాన్న హరీష్, ఆలస్యం అయిందని రైతు నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారన్నారి హరీశ్‌రావు విమర్శించారు. కాగా, అసెంబ్లీలో పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ప్రభుత్వంపై హరీష్‌ చేసిన వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు అధికారపక్షం సభ్యులు. పెన్షన్ల పంపిణీపై మాజీ మంత్రి హరీష్‌రావు, మంత్రి సీతక్కల మధ్య.. మాటల యుద్ధం నడిచింది. రెండు నెలలుగా పేదల పెన్షన్లు ఆపారని హరీష్‌ అంటే.. లెక్కలతో సహా అది తప్పని నిరూపిస్తామన్నారు సీతక్క.

ఇక మద్యం పాలసీపై హరీష్‌రావు, భట్టి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకుంది. 42వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని హరీష్‌రావు ప్రశ్నించారు. అయితే గత ప్రభుత్వంలాగా ముందే ఆక్షన్‌ పెట్టి దోచుకోవడానికి ఇది బీఆర్ఎస్‌ ప్రభుత్వం కాదన్నారు భట్టి. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫైర్ అయ్యారు హరీష్ రావు. మాజీమంత్రికి అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Also Read : Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ బరిలో బీహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్

Leave A Reply

Your Email Id will not be published!