Telangana Comment : సొమ్ము సర్కార్ ది సోకు జీవీకేది
108 అంబులెన్స్ పరిస్థితి ఇది
Telangana Comment : అమెరికాలో అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అంబులెన్స్ లు క్షణాల్లో వాలి పోతాయి. అప్పటి సత్యం కంప్యూటర్స్ రామలింగ రాజు మదిలో మెదిలిన ఆలోచనే ఇది.
ఆ తర్వాత దివంగత ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 108 అంబులెన్స్ సర్వీస్ మరింత ప్రాచుర్యం పొందింది. ప్రైవేట్ సంస్థకు కల్పతరువుగా మారింది.
దీనిపై ఆజమాయిషీ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యం బాధ్యతా రాహిత్యం చివరకు ప్రజల సొమ్ము జీవీకే పాలై పోయింది.
అంతా అయి పోయాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఖర్చు ఏమో కేంద్రం, రాష్ట్రానిది .సోకు మాత్రం 108 అంబులెన్స్ నిర్వహిస్తున్న జీవీకే ప్రైవేట్ సంస్థది. ప్రపంచంలోనే ఐటీ పరంగా టాప్ లో ఉంది హైదరాబాద్(Telangana Comment).
వేల కంపెనీలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా ఏ ఒక్క కంపెనీ దీనిని నిర్వహించేందుకు ముందుకు రాక పోవడం వాళ్ల తప్పు కాదు కొలువు తీరిన పాలకులది. ఈ ఎమర్జెన్సీ సర్వీసులకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.
కానీ నిర్వహణ లోపం కారణంగా ఆచరణలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోజుకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన జరగక మానదు.
జీతాలు రాక పోయినా, వేధింపులకు గురైనా సిబ్బంది మాత్రం ఎప్పుడో ఒకప్పుడు తమను కూడా పర్మినెంట్ చేస్తారన్న ఆశతో పని చేస్తున్నారు.
ఇకనైనా ప్రభుత్వం మేల్కోవాలి. ప్రైవేట్ జపం మానేసి సర్కార్ ఆధీనంలో నిర్వహించేలా చేస్తే సమాజానికి పేరొస్తుంది. ప్రజలకు మేలు జరుగుతుంది.
Also Read : కేసీఆర్ అఖిలేష్ యాదవ్ కీలక భేటీ