Telangana Comment : చదువు కోవడమే వీళ్లు చేసిన పాపమా
కొనసాగుతున్న బాసర విద్యార్థుల ఆందోళన
Telangana Comment : తెలంగాణలో అసలు ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోంది. బాధ్యత వహించాల్సిన సర్కార్ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.
రాజ్యాంగ మౌలిక సూత్రాలలో విద్య అన్నది తప్పనిసరిగా అందించాల్సిన హక్కు. ఓట్ల కోసం కులానికో సంఘం, ఆపై వారి పిల్లల చదువుకునేందుకు గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనమైన చరిత్ర ఈ సర్కార్ ది.
గతంలో చదువు కోవడం ఒక స్టేటస్ సింబల్ గా మారింది. కానీ ఈ రాష్ట్రంలో విద్య అన్నది ఉమ్మడి సరుకుగా మారింది. ప్రైవేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులకు ఒక కల్పతరువుగా మారింది.
ఉన్న యూనివర్శిటీలను గాలికి వదిలేశారు. విద్యా సంస్థలను మూసి వేసేలా చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. వేలాదిగా ఖాళీలు ఉన్నా నేటి దాకా మాటలు తప్ప భర్తీ చేసిన దాఖలాలు లేవు.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి ప్రారంభించిన గొప్ప విద్యా సంస్థ బాసర ఐఐఐటీ. చదువుల తల్లి బాసర సాక్షిగా దీనిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీ లో బాగానే ఉంది.
కానీ కోరి తెచ్చుకున్న తెలంగాణ(Telangana Comment) ఏర్పాటు అయ్యాక దాని ఊసే మరిచారు. ఈ రోజు వరకు వీసీని నియమించలేదు. ఇటీవలే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
వర్షంలో సైతం తడిసినా పట్టించు కోలేదు. పిల్లల పట్టుదల ముందు ప్రభుత్వం ఓడి పోయింది. తాత్కాలికంగా మంత్రి హామీలు ఇచ్చింది. కానీ మళ్లీ షరా మూమూలే.
ఫుడ్ పాయిజన్ కావడంతో ఒకరు చని పోయారు. కానీ ఇసుమంత స్పందన లేదు ప్రభుత్వంలో. తాజాగా మరోసారి ఆందోళన బాట పట్టారు. డబ్బున్న మారాజులకు యూనివర్శిటీల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపుతున్న సర్కార్ పేద పిల్లలు చదువునే బాసర ఐఐఐటీ పట్ల శ్రద్ద చూపక పోవడం నేరమే.
Also Read : బాసరలో మళ్లీ విద్యార్థుల ఆందోళన