Telangana Comment : కొలువుల భర్తీ ఎన్నికల స్టంటేనా
ఖాళీలు బారెడు భర్తీ మూరెడు
Telangana Comment : త్వరలో ఖాళీల భర్తీ. ఈ పదం వినీ వినీ తెలంగాణ ప్రజలకు(Telangana Comment) ప్రధానంగా వారి బిడ్డలైన నిరుద్యోగులకు అలవాటుగా మారి పోయింది. ఒక రకంగా ఊత పదమైంది.
హైదరాబాద్ నగర పాలిక ఎన్నికల్లో, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదిగో భర్తీ ఇదిగో భర్తీ అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు.
సర్కార్ నియమించిన బిశ్వాల్ కమిటీ భారీ ఎత్తున కొలువులు ఖాళీగా ఉన్నాయని సెలవిచ్చింది. ఆపై అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు ఇదిగో జాబ్స్ అంటూ. ఇప్పటి దాకా భర్తీ చేసింది కొన్నే.
అవి ప్రజలను వేధింపులకు గురి చేయడానికి, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసేందుకు, అక్రమంగా అరెస్ట్ చేసి బెదిరింపులపాలు చేసేందుకు పోలీసుల భర్తీకి ఓకే చెప్పారు.
ఆర్థిక శాఖ క్లియరెన్స్ అంటూ ఊదరగొట్టారు. కానీ ఈరోజు వరకు నోటిఫికేషన్లు ఇచ్చిన పాపాన పోలేదు. రేపో మాపో పరిస్థితి బాగో లేదని సర్వేలు చెబుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.
ఈ సమయంలో ముందస్తుకు వెళితే ఇక కొలువుల భర్తీ అట కెక్కినట్లే. గతంలో ఏలిన వాళ్లు ..ప్రస్తుతం ఏళుతున్న వాళ్లంతా నిరుద్యోగుల పాలిట శాపంగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి.
శాఖల వారీగా దొర వారు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు భర్తీ చేయలేక పోయారు. కేంద్రంలో సైతం సేమ్ సీన్. కనీసం పక్కనే ఉన్న ఏపీలో ఆ సర్కార్ అప్పులు చేసినా కనీసం భర్తీ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది.
నిరుద్యోగులు, ఆశావహులు మాత్రం ఇది కూడా నీటి మూటేనని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి. లేక పోతే నిరుద్యోగ యువతీ యువకుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. మాట మార్చితే మరో శ్రీలంక ఎదురయ్యే ప్రమాదం లేక పోలేదు.
Also Read : దేశ ఆర్థిక వ్యవస్థలో పాడి పరిశ్రమ కీలకం