Telangana Comment : వీళ్ల‌ను ఇలాగే వ‌ద‌లేద్దామా..!

రేప్ కు మైన‌ర్లేంటి..మేజ‌ర్లేంటి

Telangana Comment : అమ్నీషియా పబ్ కేసు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. మైనార్టీ తీర‌ని బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆపై పైశాచిక ఆనందాన్ని అనుభ‌వించారు.

తామేదో గొప్ప ప‌ని చేసిన‌ట్లు బాలిక‌ను ఎలా ఇబ్బందికి గురి చేశారో పూర్తిగా వాహ‌నంలోనే సినిమా రేంజ్ లో వీడియో తీశారు. మ‌దం ఎక్కిన ఆంబోతుల్లా ప్ర‌వ‌ర్తించారు.

ఆపై వాటిని తాము మ‌గాళ్ల‌మ‌ని, త‌మ‌కు ఎదురే లేద‌ని విర్ర‌వీగుతూ , అధికారం ఉంది క‌దా అనే బ‌లంతో సోష‌ల్ మీడియా (సామాజిక మాధ్య‌మాలు)లో షేర్ చేశారు.

ఆపై ఆ వీడియో వైర‌ల్ గా మారింది. చివ‌ర‌కు రాజ‌కీయ రంగు పులుముకుంది. ఎట్ట‌కేల‌కు ఖాకీలు కేసు న‌మోదు చేశారు. త‌ర్వాత హోం మంత్రి మ‌నుమ‌డి పేరు, ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు వెలుగు చూసింది.

మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మైన‌ర్లు కాగా ఒక‌డు మేజ‌ర్. ఇంత జ‌రిగినా సీపీ ఆనంద్ చెప్పిన తీరు జుగుస్సాక‌రంగా , అత్యంత హేయ్యంగా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు(Telangana Comment) వెల్లువెత్తాయి.

వారంతా మైన‌ర్ల‌ని వారి పేర్లు బ‌య‌ట‌కు చెప్ప కూడ‌ద‌ని పేర్కొన్నారు. గ‌తంలో రేప్ చేసిన మైన‌ర్ల‌ను సీపీగా ఉన్న ప్ర‌స్తుత ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఎన్ కౌంట‌ర్ చేశాడు.

దేశ వ్యాప్తంగా హీరోగా నీరాజ‌నాలు అందుకున్నాడు. కానీ వీళ్లు పెద్ద వాళ్ల బిడ్డ‌ల‌ట‌. వారి పేర్లు బ‌య‌ట పెట్ట‌కూడ‌ద‌ని పోలీసు వారు సెల‌విచ్చారు. స‌రే ఇవాళ 48 రోజుల త‌ర్వాత జువైల‌న్ కోర్టు మైన‌ర్ల‌కు బెయిల్ మంజూరు చేసింది.

తాజాగా హైకోర్టు ఎమ్మెల్యే కొడుక్కి కూడా లైన్ క్లియ‌ర్ ఇచ్చేసింది. నేరం చేసేందుకు, అత్యాచారాల‌కు పాల్ప‌డేందుకు మైనర్లేంటి ..మేజర్లేంటి..వీళ్ల‌ను ఎందుకు ఎన్ కౌంట‌ర్ చేయ‌కూడ‌ద‌నేది ప్ర‌శ్న‌.

Also Read : క‌ర్ణాట‌క స‌ర్కార్ పై మిన్నంటిన ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!