Telangana Comment : పాలకుల వైఫల్యం ‘అభాగ్యనగరం’
కుండ పోత గుండె కోత
Telangana Comment : వందేళ్ల నగరం ముసురు వానలకే తల్లడిల్లుతోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి తల్లడిల్లుతోంది. ఎక్కడ చూసినా ఆకాశ హార్మ్యాలు , కళ్లు చెదిరే భవనాలు కట్టుకుంటూ పోతున్నారు.
కానీ జనాభాకు తగినట్టు నగర పాలక సంస్థ చర్యలు తీసుకోవడం లేదు. వర్షాలు కురిసిన ప్రతి సారీ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రపంచంలోనే టాప్ నగరమని, ఐటీ హబ్, వీ హబ్, గ్రీన్ హబ్, రియల్ హబ్ , స్పోర్ట్స్ హబ్ అంటూ ఊదరగొడుతూ వస్తున్న పాలకుల వైఫల్యం తప్ప మరొకటి కాదు.
చెరువులను కబ్జాలు చేశారు. కాలువలను కొల్లగొట్టారు. ఎక్కడ చూసినా నీళ్లే. లంచాలకు అలవాటు పడిన నాయకులు, అధికారులు కలిసి చేసిన పాపమే ఈ కన్నీటి గోస. పిల్లలు పడవలు తయారు చేసుకుని కాలనీల్లోకి వచ్చిన నీళ్లలలో ఆడుకుంటున్నారు.
బైకులు, కార్లు, వాహనాలు కొట్టుకు పోతున్నాయి. పర్మిషన్లు ఇస్తున్నది ఎవరో వారినే దోషులుగా చేర్చాలి. అప్పుడైతేనే వ్యవస్థ బాగు పడుతుంది.
అద్భుతమైన , ఘనమైన వారసత్వపు చరిత్ర కలిగిన భాగ్యనగరం(Telangana Comment) ఇవాళ ఎందుకు అభాగ్య నగరంగా మారిందో ఏలుతున్న పాలకులు గతంలో ఏలిన పాలితులు జవాబు చెప్పాలి.
ఈ పాపం మీదేనని చెప్పక ముందే తమ తప్పు తెలుసుకోవాలి. కొంత కాలం , కొన్ని రోజుల పాటు వచ్చే వర్షాలకే చిగురుటాకుల్లా వణికి పోతుంటే ఇక రోజుల తరబడి లేదా పక్షం రోజులు గనుక వస్తే మాత్రం హైదరాబాద్ కొట్టుకు పోతుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
సింగపూర్ వద్దు..డల్లాస్ వద్దు హైదరాబాద్ బ్రాండ్ ను మాత్రం మార్చకండి బాస.
Also Read : వరదల్లో సైతం సీఎం సాయం