Telangana Congress List : కాంగ్రెస్ 55 మంది అభ్య‌ర్థులు వీరే

119 సీట్ల‌కు గాను తొలి జాబితా డిక్లేర్

Telangana Congress List : న్యూఢిల్లీ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్(Congress) ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీ అర్ధ‌రాత్రి 119 సీట్ల‌కు గాను 55 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో ఉద‌య్ పూర్ తీర్మానానికి తిలోద‌కాలు ఇచ్చారు. తండ్రీ కొడుకులు మైనంప‌ల్లి హ‌న్మంతు రావు, రోహిత్ రావుకు భార్య భ‌ర్త‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ప‌ద్మావ‌తి రెడ్డిల‌కు రెండు చోట్ల సీట్లు కేటాయించారు. ఇక ప్ర‌క‌టించిన 55 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఇక మాజీ మంత్రి జానా రెడ్డి స్థానంలో నాగార్జున సాగ‌ర్ నుంచి త‌న కొడుకు జైవీర్ రెడ్డికి కేటాయించింది.

Telangana Congress List for 55 Constituencies

ఇక ప్ర‌క‌టించిన 55 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి అభ్య‌ర్థుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌డ్డం వినోద్ కు కేటాయించింది. మంచిర్యాల నుంచి కె. ప్రేమ్ సాగ‌ర్ రావు, నిర్మ‌ల్ నుంచి కే. శ్రీ‌హ‌రి రావు, ఆర్మూర్ నుంచి పి. విన‌య్ కుమార్ రెడ్డి, బాల్కొండ నుంచి ఎం. సునీల్ కుమార్ , బోధ‌న్ నుంచి పి. సుద‌ర్శ‌న్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది.

జ‌గిత్యాల నుంచి టి. జీవ‌న్ రెడ్డి, ధ‌ర్మ‌పురం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ల‌క్ష్మ‌ణ్ కుమార్, రామ‌గుండం నుంచి ఎంఎస్ రాజ్ ఠాకూర్ , మంథ‌ని నుంచి డి. శ్రీ‌ధ‌ర్ బాబు, పెద్ద పల్లి నుంచి సీహెచ్ విజ‌య ర‌మ‌ణా రావు, వేముల వాడ నుంచి ఆది శ్రీ‌నివాస్ , మాన‌కొడూరు నుంచి కె. స‌త్య‌నారాయ‌ణ‌, మెద‌క్ నుంచి మైనంప‌ల్లి రోహిత్ రావు, ఆందోల్ ఎస్సీ నుంచి ఏ. చంద్ర‌శేఖ‌ర్ , సంగారెడ్డి నుంచి జ‌య ప్ర‌కాశ్ రెడ్డి, గ‌జ్వేల్ నుంచి న‌ర్సా రెడ్డి, మేడ్చ‌ల్ నుంచి వ‌జ్రేస్ యాద‌వ్ కు కేటాయించింది పార్టీ.

మ‌ల్కాజిగిరి నుంచి మైనంప‌ల్లి హ‌నుమంత రావు(Mynampally Hanumantha Rao), కుత్బుల్లాపూర్ నుంచి కె. హ‌నుమంత్ రెడ్డి, ఉప్ప‌ల్ నుంచి ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి, చేవెళ్ల నుంచి భీమ్ భ‌ర‌త్ , ప‌రిగి నుంచి రామ్ మోహ‌న్ రావు, వికారాబాద్ నుంచి ప్ర‌సాద్ కుమార్, ముషీరాబాద్ నుంచి అంజ‌న్ కుమార్ యాద‌వ్ , మ‌ల‌క్ పేట్ నుంచి షేక్ అక్బ‌ర్ , స‌న‌త్ న‌గ‌ర్ నుంచి డాక్ట‌ర్ కోట నీలిమను ఎంపిక చేసింది.

నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ , కార్వాన్ నుంచి ఉస్మాన్ బిన్ మొహ‌మ్మ‌ద్ అల్ హ‌జ్రి, గోషా మ‌హ‌ల్ నుంచి మొగ‌లి సునీత‌, చాంద్రాయ‌ణ‌గుట్ట నుంచి బోయ న‌గేశ్ , యాకుత్ పూరా నుంచి కే ర‌వి రాజు, బ‌హ‌దూర పూరా నుంచి రాజేశ్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్ నుంచి సంతోష్ కుమార్ , కొడంగ‌ల్ నుంచి రేవంత్ రెడ్డి, గ‌ద్వాల నుంచి స‌రితా తిరుప‌తయ్యకు కేటాయించింది.

అలంపూర్ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సంప‌త్ కుమార్ , నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీ కృష్ణ‌, క‌ల్వ‌కుర్తి నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, షాద్ న‌గ‌ర్ నుంచి శంక‌ర్, కొల్లాపూర్ నుంచి జూప‌ల్లి కృష్ణా రావు, నాగార్జున సాగ‌ర్ నుంచి జైవీర్ రెడ్డి, కోదాడ నుంచి ప‌ద్మావ‌తి రెడ్డి, న‌ల్ల‌గొండ నుంచి కె . వెంక‌ట్ రెడ్డి, న‌కిరేక‌ల్ నుంచి వేముల వీరేశం, ఆలేరు నుంచి బీర్ల ఐల‌య్య‌, స్టేష‌న్ ఘ‌న్ పూర్ నుంచి ఎస్. ఇందిర‌, న‌ర్సంపేట నుంచి మాధ‌వ రెడ్డి, భూపాల‌ప‌ల్లి నుంచి స‌త్య‌నారాయ‌ణ‌రావు, ములుగు నుంచి సీత‌క్క‌, మ‌ధిర నుంచి భ‌ట్టి విక్ర‌మార్క‌, భ‌ద్రాచ‌లం నుంచి పొదెం వీర‌య్య‌ల‌కు కేటాయించింది.

Also Read : CM KCR Campaign : కేసీఆర్ ప్ర‌చార‌ ర‌థం సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!