BRS Slams : నోట్లు ఇచ్చినోళ్లకు సీట్లు ఇచ్చారు
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఫైర్
BRS Slams : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 119 సీట్లకు గాను 55 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆదివారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగింది. పార్టీలో మారిన వాళ్లకు ప్రయారిటీ ఇచ్చిందని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలను పక్కన పెట్టిందని ఆరోపించింది.
BRS Slams Congress
వంద రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో టికెట్లను ఖరారు చేయలేని పరిస్థితిలో టీపీసీసీ ఉందని ఎద్దేవా చేసింది. డబ్బులకు టికెట్లను అమ్ముకున్నారంటూ ఆరోపించింది. సగం మంది పక్క పార్టీ నుండి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ ఫైర్ అయ్యింది. ఏమైంది మీ ఉదయ్ పూర్, రాయపూర్ ప్రకటనలు అంటూ నిలదీసింది బీఆర్ఎస్.
కుటుంబానికి ఒక్కటే సీటు అన్నారు, ప్యారా చూట్ నాయకులకు టికెట్లు ఇవ్వమని చెప్పారు తీరా లిస్టు చూస్తే అంతా వాళ్లే ఉన్నారంటూ మండిపడింది. పార్టీలో 10 రోజుల కిందట చేరినోళ్లకు 20 టికెట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టా లేక అఖిలపక్షం లిస్టా అని నిలదీసింది. టీడీపీ, బీజేపీ నుండి వచ్చిన వాళ్లు, బీఆర్ఎస్(BRS) తన్ని తరిమి వేసిన వాళ్లకు సీట్లు ఇచ్చారంటూ బీఆర్ఎస్ ఫైర్ అయ్యింది. ఇందులో సీట్లు ఎక్కువ మంది కొనుక్కున్న వాళ్లకే కేటాయించారంటూ సంచలన ఆరోపణలు చేసింది బీఆర్ఎస్.
Also Read : Telangana Congress List : కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులు వీరే
