తమిళ అస్తిత్వానికి శాశ్వత చిహ్నం కరుణానిధి

నివాళులు అర్పించిన మాజీ సీఎం ఎంకే స్టాలిన్

చెన్నై : త‌మిళ అస్తిత్వానికి శాశ్వ‌త చిహ్నం మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త అరుదైన నాయ‌కుడు క‌ళైజ్జ‌ర్ క‌రుణానిధి అని పేర్కొన్నారు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే పార్టీ అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ . కళైజ్ఞర్ మాకు సర్వస్వం అన్నారు. కరుణానిధి వర్ధంతి సందర్భంగా స్టాలిన్ నివాళులు అర్పించారు. దివంగత నేత ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజా జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. ఆధునిక తమిళనాడు రూపశిల్పిగా, తరతరాలకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా కరుణానిధిని కొనియాడారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా భావోద్వేగ నివాళులు అర్పించారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన కరుణానిధి అసాధారణ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. పరిపాలన, సాహిత్యం, సినిమా , ద్రవిడ ఉద్యమంలో ఆయన చేసిన కృషిని ప్రస్తావించారు.

ఎనభై ఏళ్ల ప్రజా జీవితం కలిగిన వ్యక్తి క‌రుణానిధి. అర్ధ శతాబ్దం పాటు ఒక ప్రధాన పార్టీకి నాయకుడు. ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. పదమూడు సార్లు శాసనసభ సభ్యుడిగా విశిష్ట సేవ‌లు అందించారు. అత్యధిక కాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన అద్బుత‌మైన నాయ‌కుడు దివంగ‌త క‌రుణానిధి అని వెల్ల‌డించారు. అసంఖ్యాక ప్రభుత్వ ఫైళ్లపై సంతకం చేసి తమిళనాడు గతిని మార్చిన నాయకుడని, ఆధునిక తమిళనాడును తీర్చిదిద్దిన శిల్పి అని కరుణానిధిని కొనియాడారు ఎంకే స్టాలిన్. రాజకీయాలకు అతీతంగా కళ, సాహిత్యం, సినిమా, నాటకరంగం, టెలివిజన్ , సోషల్ మీడియాలో చెరగని ముద్ర వేసిన కరుణానిధి ప్రతి రంగంలోనూ రాణించిన శాశ్వత తమిళ ఐకాన్ అని స్టాలిన్ గుర్తుచేశారు.

Leave A Reply

Your Email Id will not be published!