Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
42 పేజీలు 62 అంశాలకు ప్రాధాన్యత
Congress Manifesto : హైదరాబాద్ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గాంధీ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 42 పేజీలు 62 అంశాలతో కూడిన మేని ఫెస్టోను విడుదల చేశారు. దీనికి అభయ హస్తం అని పేరు పెట్టారు.
Congress Manifesto Viral
ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కాకుండా అదనంగా మరికొన్ని హామీలను చేరుస్తున్నట్లు ప్రకటించారు. మూత పడిన 6 వేల పాఠశాలలను పునరుద్దరిస్తామని పేర్కొంది. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షలు పెంచుతున్నట్లు తెలిపింది. గ్రామ, వార్డు మెంబర్లకు నెలకు రూ. 1500 గౌరవ వేతనం ఇస్తామని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ కు రూ. 12000 అందజేస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ(Congress).
ధరణిని రద్దు చేస్తామని దీని స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ ను తీసుకు వస్తామని ఇందులో ప్రతి ఒక్క భూమికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తామని ప్రకటించింది. అమర వీరుల కుటుంబాలకు తీపి కబురు చెప్పింది. ప్రతి నెలా రూ. 25,000 పెన్షన్ ఇస్తామని , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ల్యాండ్ కమీషన్ ఏర్పాటు చేస్తామని, భూ సమస్యలను పరిస్కరిస్తామని తెలిపింది. విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, కొత్తగా నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తెలంగాణ ఉద్యమ కారులపై నమోదైన అన్ని కేసులను తొలగిస్తామని స్పష్టం చేసింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు మల్లికార్జున్ ఖర్గే. ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షల భరోసా కింద సాయం.
Also Read : Revanth Reddy : అభయ హస్తం పవిత్ర గ్రంథం