Tiger 3 Movie : టైగ‌ర్ 3 మూవీ రికార్డ్ బ్రేక్

రూ. 312 కోట్ల‌కు పైగా వ‌సూలు

Tiger 3 Movie : బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ , క‌త్రీనా కైఫ్ క‌లిసి న‌టించిన టైగ‌ర్ 3(Tiger 3) సీక్వెల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది. ఊహించ‌ని రీతిలో భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తోంది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది టైగ‌ర్ 3 మూవీ.

Tiger 3 Movie Records

5 రోజుల‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తొలి రోజు రూ. 95.23 కోట్లు వ‌సూలు సాధించ‌గా 2వ రోజు రూ. 88.16 కోట్లు , 3వ రోజు రూ. 67.34 కోట్లు , 4వ రోజు రూ. 31.54 కోట్లు , 5వ రోజు రూ. 29.91 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా రూ. 312.18 కోట్ల వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డుల‌ను సృష్టిస్తుందో ఈ మూవీ.

టైగ‌ర్ మూవీ గ‌తంలో అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను సాధించింది. ఇదే స‌మ‌యంలో ఈ ఏడాది ఖాన్ హీరోల‌కు ల‌క్ క‌లిసి వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే త‌న‌కు పోటీదారుగా ఉన్న న‌టుడు షారుక్ ఖాన్ న‌టించిన రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి.

ప‌ఠాన్ రూ. 1,000 కోట్లు వ‌సూలు చేసింది. ఇది ఓ రికార్డ్. మ‌రో వైపు న‌య‌న‌తార‌తో క‌లిసి న‌టించిన జ‌వాన్ రూ. 1,060 కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించింది. స‌ల్మాన్ ఖాన్ తో పాటీగా క‌త్రీనా కైఫ్ పోటా పోటీగా న‌టించారు. డైరెక్ట‌ర్ టేకింగ్, మేకింగ్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

Also Read : Rahul Gandhi : అన్నిటా హ‌స్తం గెలుపు ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!