Telangana Governor : రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదు
ప్రభుత్వ యూనివర్శిటీలను బాగు చేయండి
Telangana Governor : రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్శిటీల అవసరం ఇప్పుడు ఏం వచ్చింది. ఓ వైపు యూనివర్శిటీలలో మౌలిక వసతులు లేవు. ఖాళీలలు వేలాదిగా ఉన్నా ఎందుకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Telangana Governor). రాజ్యాంగానికి సేఫ్ గార్డ్ గా ఉన్నామే తప్పా ప్రభుత్వంతో ఘర్షణకు దిగేందుకు కాదన్నారు.
బుధవారం రాజ్ భవన్ లో మీడియాతో గవర్నర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా హాస్టళ్లలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ కు ఎవరైనా రావచ్చని ప్రగతి భవన్ లా కాదన్నారు.
తమ తలుపులు ఎప్పుడూ తలుచులు తెరుచుకునే ఉంటాయని చెప్పారు గవర్నర్(Telangana Governor). రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను తాను ఆపలేదని కానీ వాటిపై అనుమానాలు ఉన్నాయని, నివృత్తి చేయాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు. రాష్ట్రంలోని యూనివర్శిటీల వీసీలు పని చేయాలని సూచించానని తెలిపాన్నారు.
విచిత్రం ఏమిటంటే మోయినాబాద్ ఫామ్ హౌజ్ లో తనను కూడా ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. గవర్నర్ కు రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతి బిల్లును పరిశీలిస్తున్నామని వెల్లడించారు గవర్నర్. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశ్నించారు.
తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారన్న అనుమానం కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు గవర్నర్.
Also Read : అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తా – సబితా