Telangana Rains : తెలంగాణ ప్రజలకు ఆ గండం తప్పి వరుణదేవుడు కరుణించి నట్టే
అవును.. తెలంగాణ రాష్ట్రానికి వాన గండం తప్పింది...
Telangana Rains : ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల థాటికి అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు ఏకమై పొంగిపొర్లి.. గ్రామాలు, కాలనీల్లోని లోతట్లు ప్రాంతాలను ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు ధ్వంసం కావడం, మరోవైపు రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో జనాలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు దాదాపు బంద్ అయ్యాయి. ఇక ఖమ్మం నుంచి బయటికి రాలేని పరిస్థితి.. ఇక్కడ్నుంచి అటు వెళ్లలేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 48 గంటలుగా రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే.. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తీయటి కబురు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు.
Telangana Rains Update
అవును.. తెలంగాణ(Telangana) రాష్ట్రానికి వాన గండం తప్పింది. బంగాళాఖాతంలో వాయుగుండం పూర్తిగా బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. రాష్ట్రంలో నేడు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మంగళవారం నుంచి మాత్రం మోస్తరు వర్షాలు మాత్రమే రాష్ట్రంలో కురుస్తాయని భారీ ఊరటనిచ్చే వార్తను వాతావరణ శాఖ చెప్పింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వాసులకు కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. భాగ్యనగరంలో ఇవాళ ఎలాంటి భారీ వర్షాల్లేవ్.. మోస్తరు వర్షం మాత్రమే నేడు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రానికి ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే.. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఖమ్మం జిల్లాకు మాత్రం భారీ వర్షం ముంపు లేకపోవడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోమవారం నాడు కమాండ్ కంట్రోల్ రూంలో వర్షాలపై సమావేశం నిర్వహించిన సీఎం.. భారీ వర్ష(Rains) సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్‌గా ఉండాలన్నారు. కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని ఆదేశించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులకు తెలిపారు. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. తక్షణమే కేంద్ర సాయం కోరుతు సీఎం లేఖ రాశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు తగ్గకపోవడంతో మంగళవారం నాడు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించే విషయంపై అధికారులతో రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : CM Revanth Reddy : వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం కీలక ప్రకటన చేసిన సీఎం