Telangana Revenue Employees: 40 శాతం ఫిట్ మెంట్ కు తెలంగాణా రెవిన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ !
40 శాతం ఫిట్ మెంట్ కు తెలంగాణా రెవిన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ !
Telangana Revenue:పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. కమిటీ ఆహ్వానం మేరకు గురువారం హైదరాబాద్‌లోని పీఆర్సీ కార్యాలయంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కమిటీతో భేటీ అయింది. కమిటీ ఛైర్మన్ శివశంకర్, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రెసా పలు అంశాలను ప్రస్తావించింది.
Telangana Revenue Employees:-
‘పరిపాలనలో కీలకమైన రెవెన్యూశాఖలో పనిచేస్తున్న వారి పే స్కేల్‌ను ఇతర శాఖల ఉద్యోగులతో పోల్చితే వ్యత్యాసాలు ఉన్నాయి. దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి న్యాయం చేయాలి. సచివాలయ సెక్షన్ అధికారి కన్నా గ్రూప్-2 ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు తక్కువ స్కేల్ ఉంది. దీన్ని సవరించాలి. దీంతోపాటు పంచాయతీరాజ్ శాఖలోని ఎంపీవో, సహకార శాఖలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌తో సమానమైన స్కేల్ ఇవ్వాలి. జూనియర్ అసిస్టెంట్లకు జూనియర్ ఇన్‌స్పెక్టర్ స్థాయి స్కేల్ ఇవ్వాలి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు తదుపరి పదోన్నతి కోసం సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా స్కేల్ నిర్ధారించి నాన్ కేడర్ కలెక్టర్లుగా నియమించాలి. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి’ అని పీఆర్సీ కమిటీని కోరింది. ట్రెసా ప్రతినిధులు బాణాల రాంరెడ్డి, కె.నిరంజన్, రమణ్‌రెడ్డి పాల్గొన్నారు.
Also Read :-AP Elections 2024: ఏపీలో మొదలైన ఓటింగ్ ప్రక్రియ !