Smriti Mandhana : ఐసీసీ మ‌హిళా క్రికెట‌ర్ గా స్మృతి మంధాన

2021 సంవ‌త్స‌రానికి అత్యుత్త‌మ ప్లేయ‌ర్

Smriti Mandhana : భార‌త మ‌హిళా క్రికెట్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న బ్యాట‌ర్ స్మృతీ మంథాన (Smriti Mandhana)అరుదైన ఘ‌న‌త సాధించింది. గ‌త ఏడాది 2021 సంవ‌త్స‌రానికి గాను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ అత్యుత్త‌మ మ‌హిళా క్రికెట‌ర్ అవార్డుకు ఎంపికైంది.

ఈ విష‌యాన్ని ఇవాళ ఐసీసీ ప్ర‌క‌టించింది. త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా ధ్రువీక‌రించింది. ఇదిలా ఉండ‌గా మంధాన ఇంగ్లండ్ తో డ్రాగా ముగిసిన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 78 ప‌రుగులు చేసి స‌త్తా చాటింది.

అంతే కాకుండా వ‌న్డే సీరీస్ లో టీమిండియా సాధించిన ఏకైక గెలుపులో స్మృతీ మంధాన 49 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించింది. దీంతో రాచెల్ హే హో ప్లింట్ ట్రోఫీ విజేత‌గా ఎంపికైంది.

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ప‌రిమిత ఓవ‌ర్ల సీరీస్ లో మంధాన ప్ర‌ధాన పాత్ర పోషించింది. రెండో వ‌న్డేలో 158 ప‌రుగుల ఛేద‌న‌లో స్మృతీ మంధాన (Smriti Mandhana)ఏకంగా 80 ప‌రుగులు చేసి దుమ్ము రేపింది.

ఆ విజ‌యంతో సీరీస్ ను స‌మం చేసేందుకు దోహదం చేసింది. చివ‌రి టీ20 మ్యాచ్ గెలుపొంద‌డంలో మంధాన ఏకంగా 48 ప‌రుగులు చేసి స‌త్తా చాటింది. త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించింది.

ఇంగ్లండ్ తో జ‌రిగిన ఏకైక టెస్టు డ్రాగా ముగిసినా తొలి ఇన్నింగ్స్ లో మంధాన 78 ప‌రుగులు చేసి అంద‌రినీ త‌న వైపు చూసేలా చేసింది.

ఇక వ‌న్డే సీరీస్ లో భార‌త్ సాధించిన ఏకైక గెలుపులో స్మృతీ మంధాన 49 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించింది. ఆసిస్ తో జ‌రిగిన ఏకైక టెస్టులో అద్భుత‌మైన సెంచ‌రీ సాధించింది.

Also Read : తీరు మార్చుకోని ఆటగాళ్ల‌తో ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!