TG CM : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ముందు చిట్టా తీసిన సీఎం

ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని అన్నారు...

TG CM : చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy) పాల్గొని ప్రసంగించారు. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. బందర్ పోర్ట్‌కు రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్నారు. ఎలక్ట్రిక్ వేహికిల్ తయారీకి అనుమతి ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందని.. రీజనల్ రైల్ అవసరం కూడా ఉందన్నారు. రైల్ రింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

TG CM Comment

ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందన్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. 1 ట్రిలియన్ ఎకానమి కాంట్రిబ్యూట్ చేసేందుకు తమకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ప్రధాన మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోరారు.

కాగా..సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. అలాగే జనవరి 7 నుంచి సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్‌- గుంటూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17201-17202), సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.

Also Read : MP Vijayasai Reddy : ఈడీ విచారణకు హాజరైన వైసీపీ రాజ్యసభ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!