TG Governor : మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పెట్టేందుకు ఆమోదించిన గవర్నర్
ఈ క్రమంలో, కేటీఆర్‌కి నోటీసులు జారీ చేసేందుకు గవర్నర్ సమ్మతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ పంపింది...
TG Governor : తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది, గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం వచ్చిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద అవినీతికి సంబంధించి ప్రభుత్వానికి నిర్ధారణ వచ్చినట్లు తెలుస్తోంది.
TG Governor Approves
ఈ క్రమంలో, కేటీఆర్(KTR)కి నోటీసులు జారీ చేసేందుకు గవర్నర్ సమ్మతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ పంపింది. గవర్నర్ ఆ ఫైల్‌ను ఆమోదించడంతో, ఈ-కార్ రేసు కుంభకోణం ఇప్పుడు కొత్త దశకి చేరుకుంది. అధికారుల చెడు చర్యలు బయటపడిన నేపథ్యంలో, మాజీ మంత్రి కేటీఆర్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం చేసుకునే ముందు నిధుల చెల్లింపులు జరిగాయి. HMDA, RBI అనుమతి లేకుండా రూ. 46 కోట్లు బదిలీ చేసినట్లు ప్రభుత్వ నిర్ధారించింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారుల రాయిగా లేఖ రాశారు. అవినీతిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు, కేటీఆర్‌కి కేసు నమోదు చేయడంపై గవర్నర్ సమ్మతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈ కేసు ప్రస్తుతం కొత్త మలుపును తిరగనుంది.
Also Read : Rajya Sabha : నేడు రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ మొదలుపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి