TG High Court : మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
కాగా..ఫార్ములా ఈకార్ రేసుపై హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్‌ను మెన్షన్ చేశారు...
TG High Court : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతించాలని ధర్మాసనాన్ని ఆయన తరుపున న్యాయ వాది గండ్ర మోహన్ రావు కోరారు. అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది.
TG High Court….
కాగా..ఫార్ములా ఈకార్ రేసుపై హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్‌ను మెన్షన్ చేశారు. అయితే జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో మెన్షన్ చేశారు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లగా.. ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపింది. దీంతో చీఫ్ కోర్టులో లంచ్ మోషన్‌ను కేటీఆర్ న్యాయవాదులు మెన్షన్ చేశారు. లంచ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించారు. దీంతో ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో విచారణ ఉండే అవకాశం ఉంది.
Also Read : Minister Ponguleti : ఆర్ఓఆర్ చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు