Tammareddy Bharadwaj : ఏపీ సీఎం జగన్ రెడ్డితో చిరంజీవితో పాటు మరికొందరు భేటీ కాబోతున్నారు. దీంతో ఏం చర్చించ బోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaj). ప్రభుత్వం పిలవకుండా ఎందుకు వెళ్లడమంటూ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆ మాత్రమైనా చిరంజీవిని గుర్తించడం బాగుందన్నారు.
ఆయన తమ నాయకుడే అంటూ వ్యాఖ్యానించారు భరద్వాజ. ప్రొడ్యూసర్ కౌన్సిల్ , ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని సీఎం జగన్ రెడ్డికి సూచించారు తమ్మారెడ్డి.
ఏది ఏమైనా వచ్చిన డబ్బులకు పన్ను చెల్లించక పోవడం నేరమేనని స్పష్టం చేశారు. మనం మాట్లాడే ముందు,, చర్చించే కంటే ముందు కరెక్టుగా ఉంటే సరి పోతుందన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ ఇంకో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఆన్ లైన్ వ్యవస్థ తీసుకు వస్తే అడ్డ గోలు దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లవుతుందని చెప్పారు.
టికెట్ల ధరలు పెంచినా అఖండ, పుష్ప రాజ్ మూవీస్ భారీగా కలెక్షన్లు కొల్లగొట్టాయని పేర్కొన్నారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న మూవీస్ కు కూడా ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరారు.
ఏపీలో లొకేషన్ ఛార్జీలు తీసేసినట్టే తెలంగాణలో కూడా తీసి వేయాలని తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj)డిమాండ్ చేశారు. మినీ థియేటర్లను ప్రోత్సహిస్తే బాగుంటుందన్నారు.
కరోనా కష్ట కాలాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తుంచు కోవాలని సూచించారు. థియేటర్లకు కమర్షియల్ ఛార్జీలు కాకుండా సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని కోరారు భరద్వాజ.
Also Read : హిజాబ్ వివాదంపై కమల్ కామెంట్స్