Samantha Kajal : ఉక్రెయిన్ పై దాడి అమానుషం

సినీ సెల‌బ్రెటీల తీర‌ని ఆవేద‌న

Samantha Kajal  : ఊహించ‌ని రీతిలో ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు లేకుండానే ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం చేయ‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. బాంబుల దాడులు, మిస్సైళ్ల మోత‌ల‌తో ఉక్రెయిన్ ద‌ద్ద‌రిల్లుతోంది.

కానీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు ఉక్రెయిన్. ఐక్య రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ , యురోపియ‌న దేశాలు, అమెరికాతో పాటు బ్రిట‌న్ , ఫ్రాన్స్ దేశాలు ఇప్ప‌టికే ఆర్థిక ఆంక్ష‌లు విధించాయి.

అయినా ర‌ష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ ప‌ట్టించు కోవ‌డం లేదు. ఈ త‌రుణంలో వేయి మందికి పైగా సామాన్య పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రాజ‌కీయ నాయ‌కులే కాదు ప్ర‌ముఖులు సైతం తీవ్రంగా స్పందించారు.

తాజాగా సినీ సెల‌బ్రెటీలు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై సోనూ సూద్, గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా, స‌మంత (Samantha Kajal )రుతు ప్ర‌భు, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ద‌య‌చేసి ఇక‌నైనా మారండి. యుద్దం ఆపండి. అమాయ‌కుల‌ను చంప‌కండి అంటూ వీరంతా కోరారు. యావ‌త్ ప్ర‌పంచం శాంతి కోసం ప్రార్థించాల‌ని సూచించారు.

ఈ ప్ర‌పంచంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికి బ‌తికే హ‌క్కు, సంతోషంగా జీవించ‌డానికి అర్హులేన‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ అంటూ చిన్మ‌యి శ్రీ‌పాద పోస్ట్ షేర్ చేసింది. అది ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన పిటీ ఎమోజీని కాజ‌ల్ రీపోస్ట్ చేయ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా ప్రియాంక చోప్రా ఏకంగా ఉక్రెయిన్ ను ఆదుకుందామంటూ ప్ర‌పంచానికి పిలుపునిచ్చింది.

Also Read :   ‘సామ్’ ను ఇంప్రెస్ చేసిన విల్ స్మిత్

Leave A Reply

Your Email Id will not be published!