Preity Zinta : వెండి తెర మీద చెరగని సంతకం. వెంటాడే జ్ఞాపకం ప్రీతి జింటా. ఇవాళ ఆమె పుట్టిన రోజు. ప్రీతి జింటాకు 47 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో పుట్టారు.
నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు.
జీవిత భాగస్వామి జీన్ గూడెనఫ్. ఆయన కూడా బిజినెస్ మెన్ గా పేరొందారు.
1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు.
1998లో దిల్ సే మూవీతో సినిమాల్లోకి ఎంటరైంది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
దీనికి దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. షారుఖ్ ఖాన్ నటించాడు.
అదే ఏడాది సోల్జర్ లో కూడా నటించింది. 2000లో క్యా కెహనా సినిమాలో నటించి మెప్పించింది.
ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ స్వంతం చేసుకుంది ప్రీతి జింటా(Preity Zinta ).
2003లో నటించిన కల్ హో నా హో చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.
అదే ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కోయీ మిల్ గయాలో నటించారు. ఆ రెండు మూవీస్ అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు బ్రేక్ చేశాయి.
2004లో వచ్చిన వీర్ జారా సినిమా ఆమె లోని నటనకు ఫిదా అయ్యారు.
2005లో సలాం నమస్తే , 2006లో కభీ అల్విదా నా కెహనా చిత్రాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.
ఈ వరుస సక్సెస్ లతో టాప్ హీరోయిన్ గా నిలిచారు. 2008లో కెనడా చిత్రం హెవన్ ఆన్ ఎర్త్ సినిమాతో మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ చిత్రంలో నటించారు.
ఈ మూవీలోని నటనకు గాను ప్రీతి జింటా చికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో సిల్వర్ హ్యూగో ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.
నటిగానే కాదు సోషల్ వర్కర్ గా కూడా పేరొందారు. కొంత కాలం పాటు దక్షిణ ఆసియా బీబీసీ న్యూస్ ఆన్ లైన్ లో ఓ కాలమ్ నిర్వహించారు.
ఆమె మంచి హోస్ట్, స్టేజ్ పర్ ఫార్మర్ కూడా. తన మాజీ ప్రియుడు నెస్ వాదియాతో కలిసి పీజెడ్ఎన్ జెడ్ మీడియా అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.
ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ ఎలెవన్ టీంకు సహ యజమాని ప్రీతి జింటా. 2003లో భారత్ షా కేసు సమయంలో మాఫియా గురించి ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పారు.
దీంతో ప్రీతికి జాతీయ గాడ్ ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ పురస్కారం లభించింది. ఇక ప్రీతి జింటా హిందీ లోనే కాదు తెలుగులో కూడా నటించి మనసు దోచేశారు.
వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా మూవీలో, మహేష్ బాబుతో కలిసి రాజకుమారుడు లో నటించారు.
దేవుడి కంటే కర్మ ఫలితాలనే తాను నమ్ముతానని స్పష్టం చేశారు ప్రీతి జింటా. 2016 ఫిబ్రవరి 29న జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకున్నారు.
Also Read : ఓ ‘మహాత్మా’ ఓ ‘మహర్షీ’