Nitish Kumar : సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక సీన్
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్
Nitish Kumar : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆ ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు. శుక్రవారం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏ పార్టీ కూడా శాశ్వతంగా పాలన సాగించే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదన్నారు.
అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్న ఆ పార్టీని ప్రజలు ఆదరించడం లేదని, ఇందుకు తాజా ఉదాహరణే కర్ణాటక తెలియ చేసిందని చెప్పారు. 224 సీట్లకు గాను 136 సీట్లు గెల్చు కోవడం మామూలు విషయం కాదన్నారు. తాను నిమగ్నమైన ప్రచారం కర్ణాటక ఎన్నికలతో ప్రారంభమైందని స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో చోటు చేసుకున్న ఫలితాలే తిరిగి రిపీట్ కాబోతున్నాయని పేర్కొన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar).
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , అది రాబోయే కాలంలో కచ్చితంగా కనిపిస్తుందని చెప్పారు . ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నితీశ్ కుమార్ సీఎం మమతా బెనర్జీ, కేజ్రీవాల్ , ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తదితరులను కలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : Arvind Kejriwal