JP Nadda : కాంగ్రెస్ పార్టీ పనై పోయింది – జేపీ నడ్డా
అది పార్టీ కాదు కుటుంబ పార్టీ
JP Nadda : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. అది పార్టీ కాదని కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు.
పూర్తిగా సోనియా గాంధీ ఫ్యామీలీ చేతిలో ఉందని దానిని పార్టీ ఎలా అనగలమని ప్రశ్నించారు. కుటుంబం కావడంతో 50 ఏళ్ల అనుబంధం కలిగిన వారు కూడా కాంగ్రెస్ ను వీడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
40 ఏళ్లకు పైగా పార్టీతో టచ్ లో ఉన్న వారు, పార్టీ కోసం శాయశక్తులా కృషి చేసిన సీనియర్లు కుటుంబ పార్టీ అని గ్రహించే ఆ పార్టీని వీడుతున్నారని స్పష్టం చేశారు జేపీ నడ్డా(JP Nadda).
రోజు రోజుకు పార్టీ క్షిణించిందని తమతో ఢీకొనే సత్తా లేదన్నారు. స్థానిక, జాతీయ లక్ష్యాలను పునరుద్దరించడంలో కాంగ్రెస్ విఫలమైందని జేపీ నడ్డా ధ్వజమెత్తారు.
134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీకి దిక్కు లేకుండా పోయిందన్నారు. ఆ పార్టీకి ఈరోజు వరకు శాశ్వత అధ్యక్షుడిని నియమించు కోలేని స్థితికి చేరుకుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో తమను ఢీకొనే సత్తా లేదన్నారు. ఆ పార్టీని తాము పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పారు. దేశంలో అత్యంత పురాతన రాజకీయ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ ఎందుకు బలహీన పడుతుందో ఆ పార్టీ నేతలు ఆలోచించే స్థితిలో లేరన్నారు.
గౌహతి లోని ఐటీఏ సెంటర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నడ్డా మాట్లాడారు. అస్సాంలో సీఎం హేమంత్ బిస్వా శర్మ(Hemant Biswa Sharma) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయాల రికార్డును బద్దలు కొట్టిందన్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేసులో శశి థరూర్