Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఆక్టోపస్ లా బీజేపీ అల్లుకు పోయిందన్నారు. బలమైన ప్రత్యర్థులు ఉంటేనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలరని స్పష్టం చేశారు.
థర్డ్ , పోర్త్ ఫ్రంట్ ల వల్ల పవర్ లోకి రావడం అసాధ్యమని కుండ బద్దలు కొట్టారు ప్రశాంత్ కిషోర్. అయితే దానిని ఓడించి అధికారంలోకి రావాలంటే పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందన్నారు.
ఆ ఫ్రంట్ అనేది సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదగాలని అభిప్రాయ పడ్డారు. ఓ జాతీయ ఛానల్ తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన పంచుకున్నారు.
ఒక వేళ రాబోయే ఎన్నికల్లో టీఎంసీని థర్డ్ ఫ్రంట్ గా తీసుకు వచ్చి బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చాడు పీకే.
అది ఇప్పట్లో అయ్యేది కాదన్నారు. బీజేపీని ఎదుర్కొని ఢీకొనే శక్తి ప్రస్తుతం ఉన్న పార్టీలలో లేదన్నారు. అయితే దానిని ఓడించాలంటే ముందు ఆయా పార్టీలన్నీ కలిసి సెకండ్ ఫ్రంట్ గా ఏర్పడాలని సూచించారు.
అలా అయితేనే ఏమైనా నమ్మకం పెట్టుకోవచ్చన్నారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). బీజేపీని ఎవరైనా ఓడించాలంటే ముందు సెకండ్ ఫ్రంట్ స్థాయికి అంటే రెండో స్థానానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.
పోనీ కాంగ్రెస్ పార్టీని రెండో ఫ్రంట్ గా భావిస్తారా అన్న ప్రశ్నకు కాదని సమాధానం ఇవ్వడం కలకలం రేపుతోంది. ఆయన నిన్నటి దాకా కాంగ్రెస్ తో దోస్తీ చేశారు. ఆ తర్వాత కాదనుకున్నారు.
Also Read : కేంద్రం నిర్వాకం వల్లే బొగ్గు, విద్యుత్ కొరత