P Chidambaram : ప్రమాదంలో దేశ ఆర్థిక వ్యవస్థ – చిదంబరం
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న నేత
P Chidambaram : దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదంలో ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం. శుక్రవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ద్రవ్యోల్బణం ఇంకో వైపు నిరుద్యోగం పెరుగుతున్నా ప్రధాన మంత్రి పట్టించు కోక పోవడం దారుణమన్నారు.
ధరల పెరుగుదలను అదుపులో చేయలేని పీఎం ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. పొద్దస్తమానం ఎంత కాలం మతం పేరుతో ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేస్తారంటూ నిలదీశారు చిదంబరం. సాక్షాత్తు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్(RSS) సిద్దాంతకర్త దత్తాత్రేయ కూడా ఈ రెండింటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
కొందరి ప్రయోజనాల కోసమని 135 కోట్ల భారతీయులను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు. అధికారంలో ఎందుకు ఉన్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు చిదంబరం. మీరంతా మేలుకోండి. కాఫీ వాసన మాత్రం చూడండి. కానీ దానిని మాత్రం తాగవద్దని ఎద్దేవా చేశారు.
ఇలాగే దేశ ఆర్థిక పరిస్థితి దాగి ఉందన్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి సంతోషంగా ఉన్నది ఎవరంటే కేవలం మోదీ ఆయన ప్రభుత్వమేనంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆయిల్ ధరల విషయంలో విధించిన సెస్ ను తగ్గించాలని చిదంబరం(P Chidambaram) డిమాండ్ చేశారు.
పదే పదే ఇతర దేశాలతో పోల్చడం వల్ల ప్రయోజనం ఎంత మాత్రం లేదన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సూచించారు. దిగుమతులపై ఎక్కువగా ఆధార పడటం మానుకోవాలన్నారు.
Also Read : ఢిల్లీలో అల్లర్లకు ఆప్ కుట్ర – బీజేపీ