IPL Governing Council : ఐపీఎల్ మెగా వేలంపై కీల‌క  నిర్ణ‌యం 

ముంబైలో ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ భేటీ 

IPL Governing Council  : ప్ర‌పంచ క్రికెట్ లోనే అత్యంత రిచ్ (ఆదాయం) క‌లిగిన లీగ్ గా పేరొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ 2022 నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కీల‌క స‌మావేశం ఇవాళ ప్రారంభం కానుంది.

ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే చాన్స్ ఉంది. క‌రోనా క‌ష్ట కాలంలో ఐపీఎల్ భార‌త్ లో నిర్వ‌హిస్తుందా లేక గ‌తంలో లాగానే త‌ట‌స్థ వేదిక‌లో ఏర్పాటు చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లీగ్ ల‌లో 8 జ‌ట్లు పాల్గొంటుండ‌గా ఈసారి రెండు జ‌ట్లు కొత్త‌గా చేరాయి. అహ్మ‌దాబాద్, ల‌క్నో చేరింది.

ఇదిలా ఉండ‌గా ముంబై లో జ‌రిగే ఈ భేటీలో ప్ర‌ధానంగా ఐపీఎల్(IPL Governing Council )నిర్వ‌హ‌ణ‌, పాల్గొనే జ‌ట్లు, వేదిక‌లు, షెడ్యూల్ గురించి చ‌ర్చించ‌నుంది.

ప్ర‌స్తుతం ఐపీఎల్ వేలం పాట ముఖ్యం. గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపై చ‌ర్చిస్తామ‌ని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ వెల్ల‌డించారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆయా జ‌ట్ల ఫ్రాంచైజీల‌కు సంబంధించి డెడ్ లైన్ ను ఈనెల 31 దాకా పొడిగించింది.

ఇదిలా ఉండగా వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో బెంగ‌ళూరులో ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది బీసీసీఐ ఇప్ప‌టికే. అయితే కోవిడ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆ ప్లేస్ ను కూడా మార్చ‌నున్న‌ట్లు స‌మాచారం.

కాగా కోవిడ్ దృష్ట్యా బెంగ‌ళూరు వేదిక‌ను మార్చుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

Also Read : విమ‌ర్శ‌లు డోంట్ కేర్ ఆట‌పై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!