Rajiv Kumar : ఎన్నికల సంఘానికి అగ్నిపరీక్ష
ప్రధాన ఎన్నికల కమిషనర్
Rajiv Kumar EC : ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి తాము అగ్నిపరీక్షను ఎదుర్కొంటామని చెప్పారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లో జరిగిన ఎన్నికలతో భారత ఎన్నికల సంఘం తన 400వ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసిందన్నారు సీఈసీ. ఈ ఏడాది మే 2023 లోపు కర్ణాటకలో ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేపట్టారు రాజీవ్ కుమార్(Rajiv Kumar EC) .
ఈ సందర్భంగా బెంగళూరులో సీఈసీ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రజలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల కోసం ఎన్నికల సంఘాన్ని విశ్వసించగలదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలు ఆమోదం పొందుతాయని ప్రతిసారీ అధికార మార్పిడి బ్యాలెట్ ద్వారా సజావుగా జరుగుతుందని అన్నారు.
చాలా అభివృద్ది చెందిన దేశాలలో కూడా ఇటీవల జరుగుతున్న దానితో ఇది పూర్తిగా పోల్చబడిందన్నారు రాజీవ్ కుమార్. పార్లమెంట్ కు 17వ సారి ఎన్నికలు, 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
గత 70 ఏళ్లలో భారత దేశం సామాజిక, సాంస్కృతిక ,రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, భాషా పరమైన సమస్యలను శాంతియుతంగా , చర్చల ద్వారా స్థిరీకరించిందని స్పష్టం చేశారు సీఈసీ. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా ఉందన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈసీ అగ్ని పరీక్షను ఎదుర్కొంటోందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను తనిఖీ చేసేందుకు సీఈసీ తన బృందంతో మూడు రోజుల పర్యటనలో కర్ణాటకలో పర్యటిస్తోంది. 225 మంది సభ్యుల పదవీ కాలం మే 24న ముగుస్తుంది.
Also Read : ఈడీకి షాక్ నితీష్ రాణా రిజైన్