Palaniswami : అన్నాడీఎంకే చీఫ్ ప‌ళనిస్వామిపై కేసు

అన్నాడీఎంకే ఎమ్మెల్యేపై కూడా

Palaniswami Case : అన్నాడీఎంకే చీఫ్‌, మాజీ సీఎం ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత ఎడాపాడి ప‌ళని స్వామికి బిగ్ షాక్ త‌గిలింది. ఎయిర్ పోర్ట్ లో నిర‌స‌న తెలిపిన ప్ర‌యాణికుడిపై దాడి చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప‌ళ‌నిస్వామిపై కేసు(Palaniswami Case) న‌మోదైంది. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ ను షేర్ చేసినందుకు స‌ద‌రు ప్ర‌యాణికుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా స‌ద‌రు ట్రావెల‌ర్ ఎడాపాడి ప‌ళ‌ని స్వామి వీకే శ‌శిక‌ళ‌కు ద్రోహం చేశాడంటూ ఆరోపించాడు.

గ‌తంలో జ‌య‌ల‌లిత సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప‌దే ప‌దే కాళ్లు మొక్కిన ప‌ళ‌ని స్వామికి గుర్తుకు రాలేదా అంటూ నిల‌దీశాడు. దీంతో ఎయిర్ పోర్ట్ లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన స‌ద‌రు ప్ర‌యాణికుడిపై జ‌ర్నీ చేస్తున్న అన్నాడీఎంకే చీఫ్ ప‌ళ‌ని స్వామిపై కేసు న‌మోదైంది.

ప్ర‌యాణికుడిపై దాడి ఘ‌ట‌న త‌మిళ‌నాడు లోని ముదురై ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. మాజీ సీఎం ఎడాపాడి ప‌ళ‌నిస్వామితో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యే పీఆర్ సెంథిల్ నాథ‌న్ ల‌పై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. దివంగ‌త సీఎం కుమారి జ‌య‌ల‌లిత ఉన్న స‌మ‌యంలో ఎడాపాడి పళ‌ని స్వామి, ప‌న్నీర్ సెల్వంలు న‌మ్మిన బంట్లుగా ప‌ని చేశారు.

ఆ త‌ర్వాత ఆమె ఆక‌స్మిక మ‌ర‌ణంతో వీకే శ‌శి క‌ళ తెర పైకి వ‌చ్చారు. ఇదే క్ర‌మంలో వీకే శ‌శి క‌ళ సీఎం అవుతుంద‌ని అనుకున్నారంతా . కానీ ఊహించ‌ని రీతిలో కేంద్రం జోక్యం చేసుకుంది. పళ‌ని స్వామిని(Palaniswami) సీఎంగా , ప‌న్నీర్ సెల్వంల‌ను ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

Also Read : తిప్రా మోతా వెనుక ప్ర‌సూన్ కుమార్

Leave A Reply

Your Email Id will not be published!