Prasun Kumar PK : తిప్రా మోతా వెనుక ప్ర‌సూన్ కుమార్

ప్ర‌శాంత్ కిషోర్ మాజీ స‌హాయ‌కుడు

Prasun Kumar PK : త్రిపుర‌లో ఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఒక పార్టీ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తిప్రా మోతా పార్టీ గ‌ణ‌నీయంగా ఓటు బ్యాంకును కొల్ల‌గొట్టింది. 34 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన సీపీఎం పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

2018 లో , 2023 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. కానీ గ‌త కొంత కాలంగా అంత‌గా ప్ర‌భావం చూప‌ని తిప్రా మోతా పార్టీ మాత్రం ఈసారి స‌త్తా చాటింది. మ‌రి క‌నుమ‌రుగై పోయింద‌నుకున్న పార్టీకి జ‌వ‌స‌త్వాలు క‌లిపించింది ఎవ‌రు. దాని వెనుక ఏ శ‌క్తి ప‌ని చేసింద‌ని తెలుసుకుంటే విస్తుపోక త‌ప్ప‌దు.

భార‌త దేశంలో రాజ‌కీయంగా వ్యూహాలు ప‌న్న‌డంలో తిమ్మిని బ‌మ్మి చేయ‌డంలో అందె వేసిన చేయి ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్. పార్టీ గ‌ణ‌నీయ‌మైన సీట్ల‌ను, ఓట్ల‌ను పొంద‌డంలో పీకే మాజీ స‌హాయ‌కుడు కీల‌క పాత్ర పోషించాడు. అత‌డే ప్ర‌సూన్ కుమార్(Prasun Kumar PK). త్రిపుర రాష్ట్రంలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. వీటిలో తిప్రా మోతా పార్టీ ఏకంగా 11 సీట్లు గెలుచుకుంది.

ఇది ప్ర‌ధాన పార్టీల‌కు బిగ్ షాక్. తిప్రా మోతా పార్టీ చీఫ్ ప్ర‌ద్యోత్ మాణిక్య‌తో గ‌త ఏడాది 2022 నుండి పూర్తి కాలం ప‌ని చేస్తున్నాడు ఎన్నిక‌ల స్ట్రాట‌జిస్ట్. ఈసారి ఎన్నిక‌ల్లో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. త్రిపుర రాజ వంశ‌స్థుడు ప్ర‌ద్యోత్ మాణిక్య దెబ్బుర్మాన్ నేతృత్వంలో పార్టీ చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఆన్ లైన్ లో సంగీతం, నాయ‌కుల పెద్ద క‌టౌట్ లు , సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లు , ఫ్యాష‌న్ షో ర్యాంప్ లు ఇలా ఆధునిక ప్ర‌చారంతో హోరెత్తించారు.

Also Read : ఎన్నిక‌ల సంఘానికి అగ్నిప‌రీక్ష

Leave A Reply

Your Email Id will not be published!