Madan Lal : భారత జట్టు మాజీ క్రికెటర్ మదన్ లాల్ సంచలన కామెంట్స్ చేశారు. సఫారీ టూర్ లో భాగంగా అటు వన్డే సీరీస్ , టెస్టు సీరీస్ లు సైతం కోల్పోయింది. ప్రధానంగా భారత బ్యాటర్ ల వైఫల్యమే టీమిండియా కొంప ముంచిందంటూ ఆరోపించారు.
0-3తో వైట్ వాష్ కావడాన్ని ఆయన తప్పు పట్టాడు. అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారని పేర్కొన్నాడు మదన్ లాల్(Madan Lal). ఆటపై ఫోకస్ పెట్టక పోవడం వల్లనే బ్యాటర్ లు పరుగులు చేయలేక పోయారని అభిప్రాయ పడ్డాడు.
సెంచూరియన్ టెస్టులో భారత్ అద్భుతంగా ప్రారంభించిందని కానీ దానిని కంటిన్యూ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించాడు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందంటూ మండిపడ్డాడు మదన్ లాల్(Madan Lal).
అన్ని ఫార్మాట్ లకు సంబంధించి క్రికెటర్లు పూర్తిగా ఫోకస్ పెట్టక పోవడం వల్లనే అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ చేతులెత్తేశారంటూ సీరియస్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ప్రారంభంలో ఇలాంటి ఇబ్బందులే పడింది.
ఆ తర్వాత రాను రాను తన ఆటతీరును మెరుగు పర్చుకుంటూ వచ్చిందని పేర్కొన్నాడు మదన్ లాల్. కానీ మనోళ్లు పూర్తిగా బాధ్యాతా రాహిత్యంతో ఆడటం వల్లనే ఓటమి పాలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సఫారీ టీం ఆటగాళ్లు సమిష్టి కృషితో రాణించారని కితాబు ఇచ్చాడు. స్పిన్ కు అనుకూలమైన పిచ్ లై వన్డే మ్యాచ్ లు ఆడారు కానీ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడంలో భారత్ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ధ్వజమెత్తాడు మదన్ లాల్.
ఇకనైనా ఆటగాళ్లు మారాలని లేకపోతే ఇలాగే ఓటమి పాలయ్యే చాన్స్ ఉంటుందన్నాడు.
Also Read : కోహ్లీ అద్భుతమైన ఆటగాడు