Arun Dhumal : కోహ్లీ ఎంపికపై సెలెక్టర్లదే తుది నిర్ణయం
స్పష్టం చేసిన అరుణ్ ధుమాల్
Arun Dhumal : గత కొంత కాలంగా నిలకడ లేమితో సతమతం అవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. గత నాలుగు సంవత్సరాల కాలంలో కోహ్లీ ఖాతాలో ఒక్క సెంచరీ లేదు.
గతంలో టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఈ బ్యాటర్ ఇప్పుడు ఫోర్లు, సిక్సర్లు కొట్టేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇదే సమయంలో ఫామ్ కోల్పోయిన కోహ్లీ కంటే ప్రస్తుతం దంచి కొడుతున్న యువ క్రికెటర్లలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుతున్నారు తాజా, మాజీ క్రికెటర్లు.
ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అయితే ఏకంగా కోహ్లీకి ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారని ప్రశ్నించాడు. వెంటనే అతడిని తప్పించమని సూచించాడు సెలెక్టర్లకు.
ఈ తరుణంలో ఈ నెలలో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ యూఏఈలో ప్రారంభం కానుంది. మరో వైపు ఇదే ఏడాదిలో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది.
ఇప్పటికే దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును డిక్లేర్ చేసింది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు ఇంకా ఎంపిక చేయడంలో తాత్సారం చేస్తున్నారు.
ప్రధానంగా ఎన్నడూ లేనంతటి పోటీ నెలకొంది జట్టులో. తాజాగా బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్(Arun Dhumal) సంచలన కామెంట్స్ చేశాడు. కోహ్లీని ఎంపిక చేయాలా వద్దా అన్న విషయం తమ చేతుల్లో లేదని అది సెలెక్టర్ల చేతుల్లో ఉందన్నాడు.
రోహిత్ శర్మ, కోహ్లీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవన్నాడు ధుమాల్.
Also Read : హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ దక్కనుందా